Tirumala: వామ్మో.. ఇదేంటి భయ్యా ఇంతుంది.. తిరుమలలో కొండచిలువ ప్రత్యక్షం!
టెంపుల్ సిటీ తిరుమల తిరుపతిలో మరోసారి కొండచిలువ హల్‌చల్ చేసింది. అలిపిరి నడక మార్గంలో ఉన్న ఒక కూల్ డ్రింగ్ షాప్‌లోకి కొండచిలువ చొరబడింది. దాన్ని గమనించిన స్థానికులు, భక్తులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగి అధికారులు స్నేక్ క్యాచర్ సహాయంతో కొండచిలువను బందించి తీసుకెళ్లారు.
తిరుమల కొండలు. జీవవైవిద్యం ఉట్టిపడే దట్టమైన అడవి ప్రాంతం. ఎన్నో వృక్ష జంతు జాతులకు నిలయం. అటవీ ప్రాంతం నుంచి తరచూ బయటకు వస్తున్న జంతువులు, పాములు భక్తులను భయపెడుతూనే ఉన్నాయి. ఇలా నడకదారిలో కనిపిస్తున్న పాముల సంఖ్య ఈ మధ్య మరింత ఎక్కువైంది. ఇందులో భాగంగానే అలిపిరి నడక మార్గంలో 10 అడుగుల కొండచిలువ భక్తులకు దర్శనం ఇచ్చింది. రాత్రి 8 గంటల సమయంలో గాలిగోపురం వద్ద ఒక కూల్ డ్రింక్ షాప్ లో కొండచిలువ కనిపించింది. కొండచిలువను గుర్తించిన స్థానికులు భయంతో పరుగులు తీశారు. అక్కడే ఉన్న టీటీడీ సెక్యూరిటీ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వెంటనే టీటీడీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో పనిచేసే స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడుకు ఆ సమాచారం అందింది. దీంతో గాలిగోపురం వద్దకు చేరుకున్న భాస్కర్ నాయుడు 10 అడుగులకు పైగా ఉన్న కొండా చిలువను సేఫ్ గా పట్టుకున్నారు. పట్టుకున్న కొండ చిలువను బ్యాగ్ లో బందించి తీసుకెళ్లాడు. దట్టమైన అటవీ ప్రాంతంలో వదిలి పెట్టారు. భాస్కర్ నాయుడు వచ్చి కొండచిలువను ఈజీగా క్యాచ్ చేయడంతో దుకాణాదారులు, భక్తులు ఊపిరి పీల్చుకున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్

