AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చేపల కోసం యుద్ధం.. ఆంధ్ర, తమిళనాడు మధ్య ముదురుతున్న వివాదం.. అసలు ఏం జరిగింది!

చేపల కోసం యుద్ధం.. ఆంధ్ర, తమిళనాడు మధ్య ముదురుతున్న వివాదం.. అసలు ఏం జరిగింది!

Anand T
|

Updated on: Sep 16, 2025 | 9:52 PM

Share

ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని మత్స్యకారులు, తమిళనాడు మత్స్యకారుల చేపల దోపిడీతో ఇబ్బందులు పడుతున్నారు. గత పదేళ్లుగా ఈ సమస్య కొనసాగుతోంది. తమిళనాడు మత్స్యకారులు ఆంధ్రప్రదేశ్ జలాల్లోకి అక్రమంగా ప్రవేశించి వలలు నరికి, చేపలను దోచుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఈ వివాదం వల్ల రెండు రాష్ట్రాల మత్స్యకారుల మధ్య తరచుగా ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి.

గత కొన్నేళ్లుగా ఆంధ్ర,తమిళనాడు మత్సకారుల మధ్య వివాదం చెలరేగుతుంది. ఇందుకు ప్రధాన కారణం చేపల దొంగతనం. ప్రకాశం జిల్లాలోని మత్స్యకారులు తమిళనాడు మత్స్యకారుల అక్రమ చేపల వేటతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత పదేళ్లుగా ఈ సమస్య కొనసాగుతోంది. సుమారు 70,000 మంది మత్స్యకారుల జీవనోపాధి ఈ వృత్తిపై ఆధారపడి ఉంది. తమిళనాడు మత్స్యకారులు తమ సముద్ర ప్రాంతం పరిధి దాటి, ఆంధ్రప్రదేశ్ జలాల్లోకి అక్రమంగా చొరబడి వలలను నరికి, చేపలను దోచుకుంటున్నారని ఆంధ్ర మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. ఈ కారణంగా రెండు రాష్ట్రాల మత్స్యకారుల మధ్య తరచుగా ఘర్షణలు జరుగుతున్నాయి. మత్స్యశాఖ అధికారులు ఈ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Published on: Sep 16, 2025 09:51 PM