Rain Alert: హైదరాబాద్‌ ప్రజలకు వాతావరణశాఖ అలర్ట్‌.! జర భద్రం..

Rain Alert: హైదరాబాద్‌ ప్రజలకు వాతావరణశాఖ అలర్ట్‌.! జర భద్రం..

Anil kumar poka

|

Updated on: Jun 07, 2024 | 10:29 PM

రానున్న నాలుగు రోజుల పాటు నగరంలోని అన్ని మండలాల్లో ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హైదరాబాద్‌ అంచనా వేసింది. వాతావరణ శాఖ చెబతున్న వివరాల ప్రకారం, జూన్ 8 వరకు చార్మినార్, ఖైరతాబాద్, కూకట్‌పల్లి, ఎల్‌బి నగర్, సికింద్రాబాద్, శేరిలింగంపల్లిలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయి.

రానున్న నాలుగు రోజుల పాటు నగరంలోని అన్ని మండలాల్లో ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హైదరాబాద్‌ అంచనా వేసింది. వాతావరణ శాఖ చెబతున్న వివరాల ప్రకారం, జూన్ 8 వరకు చార్మినార్, ఖైరతాబాద్, కూకట్‌పల్లి, ఎల్‌బి నగర్, సికింద్రాబాద్, శేరిలింగంపల్లిలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయి. అదే సమయంలో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. మంగళవారం తెలంగాణలోని ములుగు, మంచిర్యాల, పెద్దపల్లి, జగిత్యాల, నిజామాబాద్, హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో వర్షపాతం నమోదైంది.

రుతుపవనాల రాకకు ముందు కురిసిన వర్షాల కారణంగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. మంగళవారం మహబూబ్‌నగర్‌లో 33 డిగ్రీల సెల్సియస్‌ నమోదయింది. హైదరాబాద్‌, ఖైరతాబాద్‌లో 36.2 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయింది. గత కొద్ది రోజులుగా వేసవి తాపంతో సతమతమవుతున్న తెలంగాణ వాసులకు IMD హైదరాబాద్ అంచనా వేసిన వర్షపాతం ఎంతవరకు ఉపశమనం కలిగిస్తుందో చూడాలి. ఇక ఇప్పటికే తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. అవి రాష్ట్రంలో చురుగ్గా కదులుతున్నాయి. సాధారణంగా జూన్‌ రెండో వారంలో తెలంగాణకు రుతుపవనాలు వస్తుంటాయి. కానీ ఈ సారి చాలా ఎర్లీగానే వచ్చేశాయి. ఈ ఏడాది వారం రోజుల ముందే వచ్చాయి. ఈసారి సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదయ్యే సూచనలు ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.