Viral: వరదలో చిక్కుకున్న ఆర్టీసీ బస్సు..బస్సులో 25 మంది.! వీడియో వైరల్..
నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గం లో బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు భారీ వర్షం కురిసింది. బనగానపల్లె తో పాటు కోవెలకుంట్ల సంజామల అవుకు కొలిమిగుండ్ల మండళాల్లో వర్షం కురిసింది కోవెలకుంట్ల, సంజామల మండలాల్లో అధిక వర్షపాతం నమోదయింది. సంజామల వద్ద పాలేరు వాగు పొంగి ప్రవహిస్తోంది. పాలేరు వాగు వంతెన పై నాలుగు అడుగుల మేర వరద నీరు ప్రవహిస్తోంది.
నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గం లో బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు భారీ వర్షం కురిసింది. బనగానపల్లె తో పాటు కోవెలకుంట్ల సంజామల అవుకు కొలిమిగుండ్ల మండళాల్లో వర్షం కురిసింది కోవెలకుంట్ల, సంజామల మండలాల్లో అధిక వర్షపాతం నమోదయింది. సంజామల వద్ద పాలేరు వాగు పొంగి ప్రవహిస్తోంది. పాలేరు వాగు వంతెన పై నాలుగు అడుగుల మేర వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో వంతెనపైనుంచి తిమ్మనైనపేట నుండి వస్తున్న కోయిలకుంట్ల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు తెల్లవారుజామున వరద నీటిలో చిక్కుకుంది. బస్సులో సుమారు 25 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు.
బస్సు వంతెన పైనుండి వాగులోకి ఒకవైపు ఒరిగిపోయింది. ప్రమాదాన్ని గుర్తించిన ఆర్టీసీ బస్సు డ్రైవర్ బస్సును వెంటనే ఆపి వేశాడు. చాకచక్యంగా వ్యవహరించిన ఆర్టీసీ డ్రైవర్ ప్రయాణికులను బస్సులో నుంచి క్షేమంగా కిందికి దించాడు. దాంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. పాలేరు వాగు వంతెన పైనుంచి నీరు ప్రవహిస్తుండటంతో సంజామల తిమ్మనేనిపేట రహదారిలో రాకపోకలు నిలిచిపోయాయి. ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు కావాలా ఉన్నారు. వాగు ఎవరూ దాటకుండ రక్షణ ఏర్పాటు చేశారు. సంజామల గ్రామానికి చెందిన బస్సులోని ప్రయాణికులను క్షేమంగా స్వగ్రామానికి చేర్చారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.