ఉరివేసుకొని ప్రాణం తీసుకోబోయిన మహిళ.. కట్ చేస్తే..
కారణం ఏదైనా రాను రాను మనుషుల్లో సహనం నశించిపోతోందా అనిపిస్తోంది. చిన్న విషయాలకే తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రాణాలు తియ్యడమో.. తీసుకోవడమో చేస్తున్నారు. ఫలితంగా కుటుంబంలో అలజడి సృష్టిస్తున్నారు. తాజాగా ఓ మహిళ క్షణికావేశంలో ప్రాణాలు తీసుకోబోయింది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమివ్వడంతో సమయానికి అక్కడికి చేరుకున్న పోలీసులు ఆ మహిళను కాపాడారు.
ఈ ఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది. మెదక్, హవెలి ఘనపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లింగాసన్ పల్లి గ్రామం నుండి డయల్ 100కి కాల్ వచ్చింది. జ్యోతి అనే మహిళ తన ఇంటిలో ఆత్మహత్య ప్రయత్నం చేసుకుంటుందని పోలీసులకు ఫోన్ చేసి చెప్పారు స్థానికులు. తక్షణం స్పందించిన పోలీసులు క్షణాల్లో అక్కడికి చేరుకున్నారు. మహిళ ఇంట్లో ఉరివేసుకుంటుందని గ్రహించిన పోలీసులు ఆ ఇంటి తలుపులను బద్దలుకొట్టారు. జ్యోతి అపస్మారక స్థితిలో ఉరికి వేలాడుతూ కనిపించింది. వెంటనే స్పందించిన పోలీసులు జ్యోతికి CPR చేసి, మహిళను మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సకాలంలో సీపీఆర్ చేసి ఆస్పత్రికి తరలించడంతో జ్యోతికి ప్రాణాపాయం తప్పింది. మహిళను కాపాడిన కానిస్టేబుల్స్ వరప్రసాద్, జైనంద్,రమేష్‌ను స్థానికులు అభినందించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
విద్యార్ధులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్
సల్మాన్‌తో దిల్ రాజు బిగ్ ప్రాజెక్ట్.. డైరెక్టర్ ఎవరో తెలుసా
ట్రైన్‌లో సీటు దొరకలేదని ఆ మహిళ ఏం చేసిందో చూడండి
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..

