ప్రపంచంలోనే అతి పెద్ద విమానం శంషాబాద్‌లో ల్యాండింగ్
ప్రపంచంలోనే అతి పెద్ద కార్గో విమానం హైదరాబాద్ శంషాబాద్‌లో ప్రత్యక్షమైంది. శుక్రవారం రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం రన్‌వే పై విజయవంతంగా ల్యాండింగ్ అయింది. దుబాయ్ నుండి హైదరాబాద్ చేరుకున్న ఈ భారీ విమానాన్ని చూడటానికి విమానాశ్రయం వద్దకు పెద్దసంఖ్యలో జనాలు చేరుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ సరకు రవాణాకు ఉపయోగించే ఈ విమానం శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో ల్యాండ్ కావడం ఒక గర్వకారణమని GMR సంస్థ ప్రతినిధులు తెలిపారు.
ఆంటోనోవ్ An-124 రుస్‌లాన్ అనే ఈ విమానం బరువు సుమారు 1,81,000 కిలోలు. ఇందులో శక్తివంతమైన నాలుగు టర్బోఫాన్ ఇంజిన్‌లు ఉంటాయి. వీటిని ప్రధానంగా సైనిక సామగ్రి, భారీకార్గో రవాణా, మానవతా సహాయ కార్యక్రమాల కోసం వినియోగిస్తారు. ఈ విమానం ఉక్రెయిన్‌లో తయారైంది. ఈ విమానం సైనిక అవసరాల నుండి విపత్తుల సహాయ కార్యక్రమాల వరకు ప్రపంచంలోని దూర ప్రాంతాలకు భారీసరకును వేగంగా రవాణా చేయగలదు. అంతర్జాతీయ రవాణా రంగంలో ఈ విమానానికి చాలా డిమాండ్ ఉందని నిపుణులు చెబుతున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ రన్‌వేపై ల్యాండింగ్ సందర్భంగా విమానయాన ప్రియులు, అధికారులు, ప్రయాణికులు ఈ భారీ విమానాన్ని దగ్గరగా చూసేందుకు ఆసక్తి చూపారు. ఆకాశాన్ని చీల్చుకుంటూ దిగిన ఈ భారీ విహంగాన్ని చూడటమే ఒక ప్రత్యేక అనుభవం. విమానాశ్రయం సాంకేతిక సామర్థ్యాలను నిరూపిస్తూ ఈ ల్యాండింగ్ ఘట్టం చారిత్రాత్మకంగా నిలిచిందని జీఎంఆర్ ప్రతినిధులు పేర్కొన్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఉరివేసుకొని ప్రాణం తీసుకోబోయిన మహిళ.. కట్ చేస్తే..
విద్యార్ధులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్
సల్మాన్‌తో దిల్ రాజు బిగ్ ప్రాజెక్ట్.. డైరెక్టర్ ఎవరో తెలుసా
తాత చేసిన పనితో.. అంతులేని సంపద మనవడి సొంతం..!
వామ్మో.. వీడి ట్యాలెంట్ చూసి పోలీసులే షాక్ అయ్యారు..!
మలంతో లక్షల సంపాదన.. ప్రాణాలు కాపాడుతున్న యువకుడు!
బిర్యానీ కోసం ఆశగా లోపలి వెళ్ళాడు.. తిని బయటకి రాగానే ??
సందర్శకులను కట్టి పడేస్తున్న అరుదైన పుష్పాల ఫ్లవర్ షో
ఓర్నీ.. ఈ పాము ట్యాలెంట్ మామూలుగా లేదుగా
కొబ్బరిచెట్టుపై కాయలు కోస్తున్న కోతి.. నెట్టింట వీడియో వైరల్

