AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: భయానక ఘటన! రన్నింగ్ ట్రైన్ వెంట పరుగులు.. కాలు జారి రైలుకు, ప్లా‌ట్‌ఫాంకు మధ్యలో ఇరుక్కుని..

రైలు ప్రయాణాలు మనకి కొత్తకాకపోయినా.. ఒక్కొసారి అనుకోకుండా ఆలస్యం అవడం వల్ల టైంకు ఎక్కవలసిన రైలును అందుకోకపోవడం మనందరికీ అనుభవమే. ఆలస్యాన్ని అంగీకరించలేని మరికొంత మంది పరుగులు తీసి ఎలాగోలా రైలెక్కడం కూడా చూడకపోలేదు. ఐతే ఒక్కోసారి..

Viral Video: భయానక ఘటన! రన్నింగ్ ట్రైన్ వెంట పరుగులు.. కాలు జారి రైలుకు, ప్లా‌ట్‌ఫాంకు మధ్యలో ఇరుక్కుని..
Train Accidents
Srilakshmi C
|

Updated on: Jan 25, 2022 | 9:48 PM

Share

The young man was trying to catch a moving train, slipped his leg and then: రైలు ప్రయాణాలు మనకి కొత్తకాకపోయినా.. ఒక్కొసారి అనుకోకుండా ఆలస్యం అవడం వల్ల టైంకు ఎక్కవలసిన రైలును అందుకోకపోవడం మనందరికీ అనుభవమే. ఆలస్యాన్ని అంగీకరించలేని మరికొంత మంది పరుగులు తీసి ఎలాగోలా రైలెక్కడం కూడా చూడకపోలేదు. ఐతే ఒక్కోసారి అదుపుతప్పి ప్రాణాంతక ప్రమాదాలు కూడా అడపాదడపా చోటుచేసుకుంటుంటాయి. ఇటువంటి సంఘటనల్లో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) పలుమార్లు ప్రయాణీకుల ప్రాణాలను కాపాడిన ఉదంతాలు లేకపోలేదు. అటువంటి సంఘటనే తాజాగా ఒకటి మహారాష్ట్ర (Maharashtra)లో జరుగగా, RPF Constable చాకచక్యంగా ప్రయాణికుడి ప్రాణాలను కాపాడాడు. దీంతో ఈ విషయం టాక్ ఆఫ్ ది టౌన్ గా మరింది. అసలేం జరిగిందంటే..

ముంబైలోని వసాయ్ రోడ్ స్టేషన్‌లో కదులుతున్న రైలును ఎక్కడానికి.. దానివెంట ఓ ప్రయాణికుడు పరుగులు తీశాడు. ఐతే అనుకోకుండా అతని కాలు జారి.. రైలుకు, ప్లాట్‌ఫాంకు మధ్య ఇరుక్కుపోయింది. వెంటనే సమీపంలో ఉన్న ఆర్‌పిఎఫ్ కానిస్టేబుల్ రామేంద్ర కుమార్ మెరుపువేగంతో ప్రయాణికుడిని సురక్షితంగా రక్షించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను పశ్చిమ రైల్వే ట్విటర్‌లో పోస్ట్ చేయడంతో కేవలం 24 గంటల్లో లక్షల్లో వీక్షణలు రావడంతో వైరలయ్యింది. పశ్చిమ రైల్వే అధికారులు RPF కానిస్టేబుల్ రామేంద్ర కుమార్ సాహసాన్ని ప్రశంసించడంతోపాటు, ప్రయాణికులు కదులుతున్న రైలులోకి ఎక్కడం గానీ, దిగడం గానీ చేయవద్దని ట్విటర్ ద్వారా అభ్యర్ధించింది.

Also Read:

Fit India Challenge: మంచు నేలపై కేవలం 40 సెకన్లలో 47 పుష్‌అప్‌లు చేసిన బీఎస్ఎఫ్ జవాన్.. వీడియో వైరల్!

Follow Us
ఆ గడ్డి జ్యూస్ మోజులో పడిన ప్రజలు.. ఒక్కసారి తాగితే ఆగట్లేదుగా
ఆ గడ్డి జ్యూస్ మోజులో పడిన ప్రజలు.. ఒక్కసారి తాగితే ఆగట్లేదుగా
ఆ కవలల పెళ్లి చూసి అంతా మురిసిపోయారు.. కానీ 30 రోజుల్లోనే..
ఆ కవలల పెళ్లి చూసి అంతా మురిసిపోయారు.. కానీ 30 రోజుల్లోనే..
గుడ్ న్యూస్.. ధురంధర్ 2 ఇకపై తెలుగులోనూ చూడొచ్చు..
గుడ్ న్యూస్.. ధురంధర్ 2 ఇకపై తెలుగులోనూ చూడొచ్చు..
టీ20లో ఒక్కడే 14 సిక్సర్లు, 21 ఫోర్లతో ఏకంగా 193 పరుగులు
టీ20లో ఒక్కడే 14 సిక్సర్లు, 21 ఫోర్లతో ఏకంగా 193 పరుగులు
రంజాన్ వేళ భారీగా పెరిగిన చికెన్ ధరలు.. ఎంతంటే..?
రంజాన్ వేళ భారీగా పెరిగిన చికెన్ ధరలు.. ఎంతంటే..?
తిరుమల క్యూ లైన్లలో పాముల హల్చల్.. భయం గుప్పిట్లో భక్తులు!
తిరుమల క్యూ లైన్లలో పాముల హల్చల్.. భయం గుప్పిట్లో భక్తులు!
శ్రీవారి ప్రసాదాల కల్తీకి చెక్.. తిరుమలలో అత్యాధునిక ల్యాబ్
శ్రీవారి ప్రసాదాల కల్తీకి చెక్.. తిరుమలలో అత్యాధునిక ల్యాబ్
హైదరాబాద్‌లో ఉంటున్న ఉద్యోగులకు కేంద్రం శుభవార్త
హైదరాబాద్‌లో ఉంటున్న ఉద్యోగులకు కేంద్రం శుభవార్త
మీ వాష్ బేసిన్ పసుపు రంగులోకి మారిందా? డోంట్ వర్రీ.. ఇలా చేయండి!
మీ వాష్ బేసిన్ పసుపు రంగులోకి మారిందా? డోంట్ వర్రీ.. ఇలా చేయండి!
ఈ ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ రికార్డు ఎవరైనా బద్దలు కొడతారా?
ఈ ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ రికార్డు ఎవరైనా బద్దలు కొడతారా?