Thiruvananthapuram: సూపర్ హిట్‌ అయిన కుటుంబశ్రీ లంచ్ బెల్ ప్రాజెక్ట్.. వీడియో.

Thiruvananthapuram: సూపర్ హిట్‌ అయిన కుటుంబశ్రీ లంచ్ బెల్ ప్రాజెక్ట్.. వీడియో.

Anil kumar poka

|

Updated on: Mar 29, 2024 | 10:01 PM

మొబైల్​లో ఆర్డర్​ చేస్తే చాలు- మన వద్దకే లంచ్ బాక్స్! కేరళలో ఇటీవల ప్రారంభమైన ఈ కుటుంబశ్రీ లంచ్ బెల్ ప్రాజెక్ట్ సూపర్ హిట్ అయింది. కేవలం 16 రోజుల్లో 1.5 లక్షల రూపాయల విలువైన 2000కుపైగా ఆర్డర్లు అందుకుంది. సాధారణంగా చాలా రాష్ట్రాల్లో డ్వాక్రా సంఘాలు ఉంటాయి. కానీ కేరళలోని డ్వాక్రా మహిళంతా కుటుంబశ్రీ పేరుతో స్వయం ఉపాధి పొందుతున్నారు.

మొబైల్​లో ఆర్డర్​ చేస్తే చాలు- మన వద్దకే లంచ్ బాక్స్! కేరళలో ఇటీవల ప్రారంభమైన ఈ కుటుంబశ్రీ లంచ్ బెల్ ప్రాజెక్ట్ సూపర్ హిట్ అయింది. కేవలం 16 రోజుల్లో 1.5 లక్షల రూపాయల విలువైన 2000కుపైగా ఆర్డర్లు అందుకుంది. సాధారణంగా చాలా రాష్ట్రాల్లో డ్వాక్రా సంఘాలు ఉంటాయి. కానీ కేరళలోని డ్వాక్రా మహిళంతా కుటుంబశ్రీ పేరుతో స్వయం ఉపాధి పొందుతున్నారు. ఇప్పటికే అనేక కార్యక్రమాలు చేపట్టిన వీరు, ఇటీవల ఆహార రంగంలోకి కూడా ప్రవేశించారు. మార్చి 5న కేరళ తిరువనంతపురంలో రాష్ట్ర వ్యవహారాల శాఖ మంత్రి ఎంబీ రాజేశ్​ ఈ లంచ్ బెల్ ప్రాజెక్ట్​ను ప్రారంభించారు. కుటుంబశ్రీ ప్రాజెక్ట్ లో మహిళలు పని చేస్తున్నారన్న విషయం తమకు ఎంతో నచ్చిందని చాలా సౌకర్యంగా అనిపిస్తుందని ఇంట్లో ఎలా అయితే చేస్తారో అలానే అనిపిస్తుందని కస్టమర్లు ఫీడ్‌బ్యాక్‌ ఇస్తుంటారు.

ఈ ప్రాజెక్టు కింద భోజనాన్ని తయారు చేసేందుకు 11 మంది, ఆహారాన్ని డెలివరీ చేసేందుకు 8 మంది ఉద్యోగులు ఉన్నారు. ఆదివారం మినహా మిగిలిన అన్ని రోజుల్లో వెజ్, నాన్​ వెజ్​ ఫుడ్ అందుబాటులో ఉంటుంది. త్వరలో టెక్ పార్క్​కు కూడా డెలివరీ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. వీక్లీ, మంత్లీ ఇలా అన్ని రకాల సర్వీసెస్ అందించే పనిలో ఉన్నారు. పాకెట్ మార్ట్ మొబైల్ యాప్​ ద్వారా ఉదయం 6 గంటల నుంచి లంచ్ బాక్స్ ఆర్డర్ చేయవచ్చు. సాయంత్రం 6 గంటల తర్వాత మరుసటి రోజు కోసం ఆర్డర్​ చేయవచ్చు. ఉదయం 11 గంటల నుంచే లంచ్​ బాక్స్​లను డెలివరీ చేస్తుంటారు. మళ్లీ మధ్యాహ్నం 3 గంటలకు వచ్చి ఖాళీ బాక్స్​ను తీసుకుంటారు. శాకాహార భోజనానికి 60 రూపాయలు, మంసాహారానికి 90 రూపాయలు వసూలు చేస్తున్నారు. లంచ్​ బెల్​ ప్రాజెక్టులో స్థానిక వంటకాలకు మాత్రమే ప్రాధాన్యమిస్తున్నట్లు గిరిజ తెలిపారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.

ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.

‘నా భర్త VDలా ఉండాలి.!’ నో కన్ఫూజన్‌ తెలిసిన కాంబినేషనేగా..