ఆకలే లేని మనిషి.. 17 ఏళ్లుగా పెప్పీ ఒక్కటే !!

ఆకలే లేని మనిషి.. 17 ఏళ్లుగా పెప్పీ ఒక్కటే !!

Phani CH

|

Updated on: May 26, 2023 | 9:34 PM

ఇరాన్‌కు చెందిన ఓ వ్యక్తికి 'ఆకలి' అనేదే తెలియదట. 2006 నుంచి తినడమే మానేశాడు. ఐతే అతను ఎలా బతుకుతున్నాడు అనే సందేహం అందరి మదిలోనూ మెదిలే ప్రశ్న.. కానీ అతను ఇప్పటికీ నిక్షేపంగా ఉన్నాడు. ఎలాంటి ఆరోగ్య సమస్య లేదు. వివరాల్లోకి వెళ్లి చూసినట్లయితే అర్దేషిరి జూన్‌ 2006

ఇరాన్‌కు చెందిన ఓ వ్యక్తికి ‘ఆకలి’ అనేదే తెలియదట. 2006 నుంచి తినడమే మానేశాడు. ఐతే అతను ఎలా బతుకుతున్నాడు అనే సందేహం అందరి మదిలోనూ మెదిలే ప్రశ్న.. కానీ అతను ఇప్పటికీ నిక్షేపంగా ఉన్నాడు. ఎలాంటి ఆరోగ్య సమస్య లేదు. వివరాల్లోకి వెళ్లి చూసినట్లయితే అర్దేషిరి జూన్‌ 2006 నుంచి ఆహారం తినడం మానేశాడు. ఎలాంటి కారణం లేకుండానే అకస్మాత్తుగా తినడం మానేశాడు. తనకొక వింత అనుభూతి కలిగిందని. అలా అనిపించినప్పుడల్లా పిచ్చెక్కిపోతుందని, ఏం చేయాలో తెలియనంత బాధగా ఉంటుందని చెబుతున్నాడు అర్దేషిరి. తన నోటిలో ఏదో వెంట్రకలాంటి వస్తువు ఉన్న ఫీలింగ్‌ వస్తుందని దాని తల భాగం తన గొంతులోనూ మిగతా భాగం పొట్టలో ఉండి అడ్డుపడి, ఊపిరాడనట్లు అనిపిస్తుందని చెప్పాడు. ఆ బాధ మాటల్లో చెప్పలేనంటున్నాడు. ఈ విషయమై అనేక మంది వైద్యులను సంప్రదించాడు కానీ ఎవ్వరూ తన సమస్యను నిర్ధారించ లేకపోయారట. ఐతే తాను బాగా అలసిపోయినప్పుడు పెప్సీ వంటి శీతల పానీయాన్ని తాగుతుంటాడు. రోజుకి మూడు లీటర్లు పెప్సీ డ్రిండ్‌ తీసుకుంటాడు. ఒక్కోసారి రాత్రిళ్లు కేవలం నాలుగు గంటలు మాత్రమే నిద్రపోతానని చెబుతున్నాడు. అయితే తనకు ఇదేమి షాకింగ్‌గా లేదని ఇప్పటికీ ఈ వింత అనుభూతికి గల కారణం మాత్రం ఎవ్వరికీ తెలియలేదని చెబుతున్నాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఎయిర్ హోస్టెస్‌తో కలిసి స్కై చిలిపి చేష్టలు.. వీడియో చూస్తే నవ్వులే

ఉచిత పెట్రోలు పంపిణీ.. దొరికినవారికి దొరికినంత..

Alien signal: ఏలియన్స్‌ నుంచి మనకు తొలి మెసేజ్ !!

ఎగిరే బల్లిని చూశారా ఎప్పుడైనా ?? అత్యంత ఖరీదైన జీవులుగా ప్రఖ్యాతి

బాలుడి వీడియోపై నెటిజ‌న్లు ఫిదా.. షాపును కాపాడేందుకు ఏం చేశాడంటే !!