Alien signal: ఏలియన్స్ నుంచి మనకు తొలి మెసేజ్ !!
కేవలం భూమి మీదే జీవజాలం ఉందా? అంతరిక్షంలో మనలాంటి గ్రహాలు ఇంకేమైనా ఉన్నాయా? అక్కడ జీవం ఉందా.... గ్రహాంతరవాసులు జీవిస్తున్నారా? సమాధానాల కోసం చాలా ఏళ్లుగా శాస్త్రవేత్తలు పరిశోధనలు సాగిస్తూనే ఉన్నారు. గ్రహాంతరవాసులపై కచ్చితమైన సమాచారం లేకపోయినప్పటికీ..
కేవలం భూమి మీదే జీవజాలం ఉందా? అంతరిక్షంలో మనలాంటి గ్రహాలు ఇంకేమైనా ఉన్నాయా? అక్కడ జీవం ఉందా…. గ్రహాంతరవాసులు జీవిస్తున్నారా? సమాధానాల కోసం చాలా ఏళ్లుగా శాస్త్రవేత్తలు పరిశోధనలు సాగిస్తూనే ఉన్నారు. గ్రహాంతరవాసులపై కచ్చితమైన సమాచారం లేకపోయినప్పటికీ.. ఏదో ఒక గ్రహంపై జీవిస్తున్నారనేదే అందరి నమ్మకం. వాటికి మరింత ఊతమిచ్చే ఘటన తాజాగా చోటు చేసుకుంది. భూమికి సమీపంలో ఉన్న అంగారక గ్రహం నుంచి ఎన్‌కోడ్ చేసిన ఓ సమాచారాన్ని యూరప్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ఎక్సోమార్స్ ట్రేస్ గ్యాస్ ఆర్బిటార్ (TGO) భూమికి చేరవేసింది. అంగారకుడి చుట్టూ తిరుగుతూ అక్కడి పరిస్థితులను నిశితంగా గమనించేందుకు యూరప్ స్పేస్ ఏజెన్సీ టీజీవోను గతంలో ప్రయోగించింది. అయితే, ఈ సందేశాన్ని గ్రహాంతర వాసులే పంపించారా? అనే దానిపై స్పష్టత లేదు. అయితే, ఎన్‌కోడ్ చేసిన ఆ సందేశంలో ఏముందో తెలుసుకోవడం శాస్త్రవేత్తలకు కఠిన సమస్యగా మారింది. దానిని డీకోడ్ చేసేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నవారికి అవకాశం కల్పించారు. శాస్త్రసాంకేతిక పరంగానే కాకుండా ఆ సందేశంలో సాంస్కృతిక పరమైన అంశాలేమైనా ఉన్నాయా? అనే కోణంలోనూ పరిశీలించేందుకు సమాయత్తమవుతున్నారు. అంగారక గ్రహం నుంచి ఎన్‌కోడ్ చేసి వచ్చిన సిగ్నల్స్‌ను asignin.space వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. ఆసక్తి ఉన్న వారు వాటిని డీ కోడ్ చేసి, దాని అర్థాన్ని తిరిగి వారికి పంపించవచ్చు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఎగిరే బల్లిని చూశారా ఎప్పుడైనా ?? అత్యంత ఖరీదైన జీవులుగా ప్రఖ్యాతి
బాలుడి వీడియోపై నెటిజన్లు ఫిదా.. షాపును కాపాడేందుకు ఏం చేశాడంటే !!
మంచి దొంగ.. రూ. 4 లక్షల నగలను.. 9 ఏళ్ళ తర్వాత తిరిగి ఇచ్చేశాడు
2018 రివ్యూ.. సినిమా ఎలా ఉంది అంటే ??
Malli Pelli: నరేశ్, పవిత్రా లోకేశ్‌ల ‘మళ్ళీ పెళ్లి’ మూవీ ఎలా ఉందంటే ??
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

