భారతదేశంలో ప్రస్తుతం సోషల్ మీడియా ట్రెండ్ నడుస్తుంది. ముఖ్యంగా వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్స్‌లో రీల్స్‌కు రీచ్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి రీల్స్ చేస్తూ ఒకేసారి ఫేమస్ అయిపోదామని ప్రయత్నిస్తూ ఉంటారు. దీని కోసం ప్రమాదకర విన్యాసాలు చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటూ ఉంటారు. తాజాగా అలాంటి ఘటనే గుజరాత్‌లో జరిగింది. నలుగురు యువకులు రీల్స్ సరదాతో మహీంద్రా థార్ ఎస్‌యూవీలను కచ్‌లోని ముంద్రా సముద్రతీరానికి తీసుకెళ్లారు. అయితే ఆ కార్లు పెరుగుతున్న ఆటుపోట్లలో చిక్కుకుపోయాయి . దీంతో లబోదిబోమనడంతో స్థానికులు వారిని గుర్తించి రక్షించారు. ఈ తాజా ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
సోషల్ మీడియాలో వైరల్ వీడియోలో సముద్ర తీరంలో సముద్రానికి చాలా దగ్గరగా డ్రైవ్ చేసిన యువకులు ఒక్కసారిగా అలల ఉధృతి పెరగడంతో రెండు మహీంద్రా థార్‌లతో సముద్రంలో నిలబడి సాయం కోసం ఎదురుచూశారు. మొదట రెండు మహీంద్రా థార్ వాహనాలను నీటిలో నుండి బయటకు తీయడానికి చాలా కష్టపడ్డారు. కానీ వారి ప్రయత్నాలు ఫలించలేదు. స్థానికుల సహాయంతో ఎట్టకేలకు వాహనాలను నీటిలో నుంచి బయటకు తీశారు. అలల ఉద్ధృతి వాహనాలను చుట్టుముట్టడం, ఈ క్రమంలో ఇరుక్కుపోవడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. అదృష్టవశాత్తూ, అప్రమత్తమైన స్థానికులు ఆటుపోట్లు మరింత పెరగకముందే వాహనాలను తిరిగి సురక్షితంగా తీసుకొచ్చారు.
For reel mania, two youths drove two Thar cars into deep waters at Mundra beach, Kutch.
High tide almost engulfed the vehicles, trapping them.
With villagers’ help, Thars were retrieved, but one Jeep’s engine failed.pic.twitter.com/C5Ft67d876
— Kumar Manish (@kumarmanish9) June 23, 2024
అయితే ఈ ఘటనలో యువకులకు ఎలాంటి గాయాలు కాలేదు. అయితే ఎస్‌యూవీల్లో ఒక్కదాంట్లో నీరు అధికంగా వెళ్లడం వల్ల ఇంజిన్ దెబ్బతింది. ముంద్రా మెరైన్ పోలీసులు సంఘటనను గమనించి రెండు ఎస్‌యూవీలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఎఫ్ఐఆర్ నమోదు చేసిన అనంతరం వాహనాలను విడిచిపెట్టినట్లు సమాచారం. సాధారణంగా సముద్రతీరం దగ్గర డ్రైవింగ్ చేయడం చాలా ప్రమాదకరం మరియు దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఆటుపోట్ల సమయంలో వీలైనంతగా సముద్రం నుంచి దూరంగా ఉండడం బెటర్ అని సూచిస్తున్నారు. ముఖ్యంగా వాహనాలను సముద్రం దగ్గరగా తీసుకెళ్తే సముద్రపు ఉప్పు నీరు వల్ల వాహనాలు చెడిపోతాయి. అలాగే సముద్రంలోని ఇసుక రేణువుల వల్ల కార్ల ఇంజిన్ ప్రదేశంలో దెబ్బతింటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి