బాబోయ్.. నగరంలో మటన్, ఫిష్ ధరలు ఏంటి ఇంత పెరిగాయి
బర్డ్‌ఫ్లూ ఎఫెక్ట్ హైదరాబాద్ మహానగరంలోని బిర్యాని హోటల్స్‌పైనా పడింది. గత వారం రోజుల నుంచి హైదరాబాద్‌లోని అనేక హోటళ్లల్లో చికెన్ పూర్తిగా మాయం అయిపోయింది. బర్డ్‌ఫ్లూ కారణంగా చికెన్ అంటేనే భయపడుతున్నారని.. మటన్, సీ ఫుడ్‌కే కస్టమర్లు ఇంపార్టెన్స్ ఇస్తున్నారని హైదరాబాద్ హోటల్ యజమానులు చెప్తున్నారు.
ఆదివారం చికెన్ షాప్‌లు కస్టమర్లు లేక వెలవెల బోతుంటే… మటన్ షాపులు, ఫిష్ మార్కెట్ దగ్గర మాత్రం రద్దీ కనిపిస్తోంది. 50 శాతం కంటే ఎక్కువగానే సేల్స్ పడిపోయినట్లు వ్యాపారులు చెబుతున్నారు. హైదరాబాద్‌లో ప్రతి నిత్యం 6 లక్షల కిలోల చికెన్ సేల్ అవుతుండగా.. ప్రస్తుతం 50 శాతం కూడా సేల్స్ లేదని అంటున్నారు. మరికొన్ని రోజులు పరిస్థితి ఇలాగే ఉంటే తాము చాలా నష్టపోయే పరిస్థితి ఉందని వ్యాపారులు వాపోతున్నారు. డిమాండ్ పెరగడంతో మటన్, ఫిష్ ధరలు కూడా 17 శాతానికి పైగా పెరిగాయి. వారం క్రితం కిలో రూ.850లు ఉన్న మటన్ రేటు ప్రస్తుతం కిలో రూ.1000కి చేరింది. నగరంలో చేపల ధరల విషయంలోనూ ఇదే ధోరణి కనిపిస్తోంది. కిలో రూ.50 నుంచి 100 పెరిగింది. హైదరాబాద్‌లో పెళ్లిళ్లు, ఇతర ఫంక్షన్ల విందుల విషయంలో కూడా బర్డ్ ఫ్లూ భయాల ప్రభావం కనిపిస్తుంది. చాలామంది తమ మెనూల నుండి చికెన్‌ను తీసివేసి, అధిక ధరలు ఉన్నా సరే మటన్, చేపలను చేర్చుతున్నారు. హైదరాబాద్‌లో మటన్, చేపల రేట్లు పెరగడం, చికెన్ ధరలు తగ్గడం అనే ట్రెండ్ ఎంతకాలం కొనసాగుతుందో వేచి చూడాలి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మగ పోలీసులకు మేకప్‌లో ట్రైనింగ్ ఐబ్రోస్, మాయిశ్చరైజింగ్ లో మెళకువలు
రోడ్డుపై వెళ్తుండగా వినికిడిని కోల్పోయిన ఆటో డ్రైవర్! ఏం జరిగిందంటే ??
నదిలో స్నానం చేస్తుండగా కాళ్ల కింద ఏదో తగిలింది.. ఏంటా అని చూడగా.. షాక్ !!
ప్రియుడి కోసం ప్రియురాళ్ల మధ్య పోటీ.. విషం తీసుకొని…
అర్ధరాత్రి రోడ్డుపై అనుకోని అతిథి.. భయంతో ఆగిపోయిన వాహనదారులు.. ఆ తర్వాత?
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

