ప్రియుడి కోసం ప్రియురాళ్ల మధ్య పోటీ.. విషం తీసుకొని…
ఒకరికి తెలియకుండా మరొకరితో ప్రేమాయణం నడిపాడు. ఒక ప్రేయసికి పెళ్లయిపోయింది. ఆమె స్నేహితురాలితో తన ప్రేమ ప్రయాణం కొనసాగించాడు. ఈ విషయం తెలియని మొదటి ప్రియురాలు భర్తను వదిలేసి ప్రియుడి కోసం వచ్చేసింది. వచ్చాక విషయం తెలుసుకొని ప్రియురాళ్లిద్దరూ పోటీపడ్డారు. విషం తీసుకున్నారు.. ఎవరు బ్రతికి ఉంటే వారికే తమ ప్రియుడు సొంతం అని నిర్ణయించుకున్నారు.
ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీలో ఒక ప్రేయసి కన్నుమూసింది. ఈ సంఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. బత్తలపల్లి కి చెందిన ప్రియుడు దివాకర్, ప్రియురాళ్ళు రేష్మ, శారద ఒకే కాలేజీలో డిగ్రీ చదువుకున్నారు. కాలేజీలో చదువుకునే రోజుల్లో దివాకర్, రేష్మ ప్రేమించుకున్నారు. మరోవైపు రేష్మ, శారద కూడా కాలేజీలు స్నేహితులే. రెండు సంవత్సరాల క్రితం ప్రియురాలు రేష్మకు వేరే వ్యక్తితో వివాహం జరగడంతో… రేష్మ స్నేహితురాలు శారదతో ప్రియుడు దివాకర్ ప్రేమాయణం నడిపాడు. అయితే ప్రియుడు దివాకర్ ను మర్చిపోలేక… పెళ్లయిన కొద్ది రోజులకే రేష్మ.. భర్తను వదిలేసి ప్రియుడి వద్దకు వచ్చేసింది. అప్పటికే శారదతో లవ్ లో ఉన్న దివాకర్, ఇప్పుడు రేష్మ కూడా భర్తను వదిలేసి రావడంతో… ఒకరికి తెలియకుండా మరొకరితో ట్రైయాంగిల్ లవ్ స్టోరీని కంటిన్యూ చేశాడు. రేష్మ, శారద ఫ్రెండ్స్ కావడంతో ఇన్స్టాగ్రామ్ సంభాషణలో ప్రియుడు దివాకర్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ బయటపడింది. ఇద్దరు ప్రేమిస్తున్నది దివాకర్ నే అని తెలుసుకున్న రేష్మ, శారద.. దివాకర్‌ను నిలదీయడంతో ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అర్ధరాత్రి రోడ్డుపై అనుకోని అతిథి.. భయంతో ఆగిపోయిన వాహనదారులు.. ఆ తర్వాత?
దిమ్మతిరిగే న్యూస్ ‘బ్రహ్మ రాక్షస్’ గా ప్రభాస్ | తండేల్‌కు లీకర్స్ బిగ్ ఝలక్
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే

