అర్ధరాత్రి రోడ్డుపై అనుకోని అతిథి.. భయంతో ఆగిపోయిన వాహనదారులు.. ఆ తర్వాత?
ఇటీవల వన్యప్రాణులు జనావాసాల్లోకి చొరబడటం సర్వసాధారణమైపోయింది. పులులు, చిరుతలు, ఏనుగులు గ్రామాల్లోకి చొరబడి పశువులను బలితీసుకున్న ఎన్నో ఘటనలు ప్రతిరోజూ ఎక్కడో అక్కడ జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఓ పెద్ద కొండచిలువ రోడ్డు దాటుతూ వాహనదారులను కంగారెత్తించింది. అర్ధరాత్రి వేళ రోడ్డు దాటుతున్న ఆ భారీ కొండచిలువను చూసి వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
ఎక్కడి వాహనాలు అక్కడే ఆపివేశారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది. శంకరపట్నం మండల కేంద్రంలోని హైస్కూల్ సమీపంలో భారీ కొండచిలువ హల్‌చల్ చేసింది. హైస్కూల్ పక్కనే పంట పొలాలు ఉండటంతో ఆహారం కోసం పొలాల్లోకి వచ్చిన కొండచిలువ రాత్రివేళ రోడ్డు దాటుతూ వాహనదారుల కంటపడింది. రోడ్డు దాటుతున్న ఆ కొండచిలువను వాహనదారులు తమ మొబైల్స్‌లో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సుమారు 12 అడుగులు పొడవున్న ఆ కొండచిలువ పంట పొలాల నుంచి అడవిలోకి వెళ్లే క్రమంలో రోడ్డు పైకి వచ్చింది. రోడ్డుపైన వెళ్తున్న వాహనదారులు ఒక్కసారిగా కొండచిలువను చూసి షాకయ్యారు. రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలిపివేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
దిమ్మతిరిగే న్యూస్ ‘బ్రహ్మ రాక్షస్’ గా ప్రభాస్ | తండేల్‌కు లీకర్స్ బిగ్ ఝలక్

ఆచి.. తూచి.. అడుగు వెయ్యాలంటారు ఇందుకే..

కొంప ముంచిన కాఫీ.. ఏకంగా రూ.415 కోట్లు పరిహారం..

వేసవిలో బైక్ లు వాడుతున్నారా.. వీటితో జాగ్రత్త!

తాచుపాము కరిచినా..10వ తరగతి పరీక్ష రాసిన విద్యార్థి వీడియో

తెలుగు రాష్ట్రాల్లో బుసలు కొడుతున్న పాములు వీడియో

ఈ కోతికి ఫోన్ కనిపిస్తే చాలు.. వీడియో

ఎక్కడపడితే అక్కడ రీల్స్ చేస్తే ఇలాగే పగుల్తది..
