పెళ్లి వేదికపై సంతోషంతో ఫోటోలకు ఫోజులిచ్చిన వరుడు.. ఇంతలో
వివాహ వేదికపై వరుడు చాలా సంతోషంగా ఉన్నాడు. కెమెరామెన్‌కు చాలా హ్యాపీగా ఫోటోలకు ఫోజులిస్తున్నాడు. బంధుమిత్రులంతా ఆనందంతో వివాహ తంతును వీక్షిస్తున్నారు. ఇంతలో ఊహించని సీన్ జరిగింది. ఒక్కసారిగా ఓ మహిళ పెళ్లి వేదికపైకి దూసుకొచ్చి వరుడి చొక్కా పట్టుకుంది. ఊహించని పరిణామానికి వరుడు షాకయ్యాడు. ఆమె అతడి మాజీ ప్రియురాలు.
ఆమె వరుడి చొక్కాపట్టుకొని నిలదీస్తోంది. పెళ్లిమండపంలోని వారంతా ఆశ్చర్యంగా చూస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ వివాహ కార్యక్రమంలో సూటు, బూటు వేసుకొని పెళ్లి దుస్తులతో ఆనందంలో తేలిపోతున్నాడు వరుడు. తనదైన స్టైల్లో ఫోటోలకు ఫోజులిస్తున్నాడు. ఇంతలో అక్కడికి వచ్చిన ఓ మహిళ వరుడి చొక్కాపట్టుకొని ఏదో విషయమై అతడ్ని నిలదీస్తోంది. అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక బంధువులంతా తెల్లమొహం వేసుకొని చూస్తున్నారు. వరుడు ఎంతగా విడిపించుకోవాలనుకున్నా ప్రియురాలు వదల్లేదు. ఇంతలో అక్కడున్న వరుడి బంధువులు ఆమెకు సర్ధిచెప్పి వేదికపైనుంచి కిందకు పంపించారు. అయినా ఆమె వరుడివైపు చేయి చూపిస్తూ హెచ్చరిస్తూనే ఉంది. ఈ వీడియోలో ఇంతవరకే ఉంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది తెలియలేదు. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న ఈ వీడియోను ఇప్పటికే 8 మిలియన్ల మందికి పైగా వీక్షించారు. లక్షలాది మంది లైక్ చేశారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. ఆమెను చూసి భయపడుతున్నాడంటే వరుడిదే తప్పు అయి ఉంటుందని కామెంట్లు చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బాబోయ్.. నగరంలో మటన్, ఫిష్ ధరలు ఏంటి ఇంత పెరిగాయి
మగ పోలీసులకు మేకప్‌లో ట్రైనింగ్ ఐబ్రోస్, మాయిశ్చరైజింగ్ లో మెళకువలు
రోడ్డుపై వెళ్తుండగా వినికిడిని కోల్పోయిన ఆటో డ్రైవర్! ఏం జరిగిందంటే ??
నదిలో స్నానం చేస్తుండగా కాళ్ల కింద ఏదో తగిలింది.. ఏంటా అని చూడగా.. షాక్ !!

ఎండతాపాన్ని తట్టుకోలేకపోయిన పాము..పాపం ఇలా..వీడియో

బ్రో.. నీ ఐడియా సూపర్..వీడియో

నడి సముద్రంలో తప్పిపోయిన మత్స్యకారుడు 95 రోజుల తర్వాత.. వీడియో

అతనంటే పాములకు ఎందుకంత పగ..వెంటాడి మరీ వీడియో

ఆచి.. తూచి.. అడుగు వెయ్యాలంటారు ఇందుకే..

కొంప ముంచిన కాఫీ.. ఏకంగా రూ.415 కోట్లు పరిహారం..

వేసవిలో బైక్ లు వాడుతున్నారా.. వీటితో జాగ్రత్త!
