నదిలో స్నానం చేస్తుండగా కాళ్ల కింద ఏదో తగిలింది.. ఏంటా అని చూడగా.. షాక్ !!
నదిలో బోటు షికారు చెయ్యాలని, ఈత కొట్టాలని చాలామంది ఉత్సాహపడుతుంటారు. ఈక్రమంలోనే కొందరు కొందరు నదిలో పడవపై షికారుకు వెళ్లారు. ఓ వ్యక్తి అందులో స్నానం చేయాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా పడవలోంచి నదిలోకి దూకి ఈత కొట్టాడు. ఈ క్రమంలోనే అతనికి ఊహించని సంఘటన ఎదురైంది.
అతను స్నానం చేస్తుండగా కాళ్లకింద ఏదో రాయిలాగా తగిలింది. అది కదులుతుండటంతో అనుమానం వచ్చిన అతను ఏమై ఉంటుందా అని దాన్ని చేత్తో పైకి తీసి చూశాడు. అంతే ఒక్కసారిగా షాకయిన అతను దాన్ని అవతలికి విసిరేసి ఒక్క ఉదుటున బోటులోకి ఎక్కి కూర్చున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాళ్లకు తగిలిన దాన్ని బయటికి తీసి చూడగా అది ఒక మొసలి.. నోరు తెరచి కనిపించింది. దాన్ని చూడగానే భయంతో దూరంగా విసిరేశాడు. ఆ తర్వాత పరుగు పరుగున వచ్చి పడవలో పడిపోయాడు. ఇలా మొసలి నుంచి తృటిలో తప్పించుకున్నాడన్నమాట. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. అతను తృటిలో చావునుంచి తప్పించుకున్నాడని కొందరు, యమధర్మరాజు లీవ్‌లో ఉన్నట్టున్నారు.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియోను ఇప్పటికే 3.8 మిలియన్ల మందికి పైగా వీక్షించారు. 89 వేల మందికి పైగా లైక్ చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రియుడి కోసం ప్రియురాళ్ల మధ్య పోటీ.. విషం తీసుకొని…
అర్ధరాత్రి రోడ్డుపై అనుకోని అతిథి.. భయంతో ఆగిపోయిన వాహనదారులు.. ఆ తర్వాత?
దిమ్మతిరిగే న్యూస్ ‘బ్రహ్మ రాక్షస్’ గా ప్రభాస్ | తండేల్‌కు లీకర్స్ బిగ్ ఝలక్

ఆచి.. తూచి.. అడుగు వెయ్యాలంటారు ఇందుకే..

కొంప ముంచిన కాఫీ.. ఏకంగా రూ.415 కోట్లు పరిహారం..

వేసవిలో బైక్ లు వాడుతున్నారా.. వీటితో జాగ్రత్త!

తాచుపాము కరిచినా..10వ తరగతి పరీక్ష రాసిన విద్యార్థి వీడియో

తెలుగు రాష్ట్రాల్లో బుసలు కొడుతున్న పాములు వీడియో

ఈ కోతికి ఫోన్ కనిపిస్తే చాలు.. వీడియో

ఎక్కడపడితే అక్కడ రీల్స్ చేస్తే ఇలాగే పగుల్తది..
