రోడ్డుపై వెళ్తుండగా వినికిడిని కోల్పోయిన ఆటో డ్రైవర్! ఏం జరిగిందంటే ??
రోడ్డుపై ఆటో నడుపుకుంటూ వెళ్తున్న ఆటో డ్రైవర్ అనూహ్య రీతిలో వినికిడి కోల్పోయాడు. రోడ్డుపై వెళ్తున్న సమయంలో పక్కనే ఉన్న ట్రక్కు టైర్ ఒక్కసారిగా పెద్ద శబ్ధంతో పేలింది. దీంతో ఆటో డ్రైవర్ చెవి పట్టుకుని బాధతో విలవిలలాడాడు. తర్వాత గమనిస్తే అతడు వినికిడి శక్తి పూర్తిగా కోల్పోయాడు. ఈ షాకింగ్ ఘటన ముంబైలో చోటు చేసుకుంది.
ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఓ ఆటోరిక్షా డ్రైవర్ చెవి పట్టుకుని రోడ్డు పక్కన నిలబడి ఉండటం చూడొచ్చు. అతని చుట్టూ చాలా మంది వ్యక్తులు గుమికూడి ఉన్నారు. ఈ వీడియోలో రోడ్డుపై ఆగి ఉన్న ట్రక్కు టైరు పగిలిపోవడం, ఆ పక్కనే ఉన్న ఆటో తీవ్రంగా దెబ్బతిన్నట్లు కనిపిస్తోంది. వీడియోలో చెవి పట్టుకుని నిలబడిన వ్యక్తి ట్రక్కు టైరు పేలిపోవడం వల్ల ఆటో ధ్వంసమైందని చెప్పడం కనిపిస్తుంది. ఇంతలో మరొక వ్యక్తి మాట్లాడగా.. నువ్వు ఏం మాట్టాడుతున్నావో నాకు వినిపించడం లేదు అని ఆటో డ్రైవర్ చెప్పిన సీన్ కనిపిస్తుంది. ఈ ఘటనలో డ్రైవర్ శాశ్వతంగా తన వినికిడిని కోల్పోయాడా.. లేదా.. తాత్కాలికంగా వినికిడి కోల్పోయాడా అన్నది ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. అయితే ఈ సంఘటన ముంబైలో జరిగినట్లు తెలుస్తున్నా.. ఎప్పుడు జరిగిందనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. ఆటో డ్రైవర్ రోడ్డుపై వెళ్తున్న క్రమంలో అదే రోడ్డుపై వెళ్తున్న మరో ట్రక్కు టైర్ హఠాత్తుగా పేలడం వల్ల ఈ దారుణం జరిగినట్లు తెలుస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నదిలో స్నానం చేస్తుండగా కాళ్ల కింద ఏదో తగిలింది.. ఏంటా అని చూడగా.. షాక్ !!
ప్రియుడి కోసం ప్రియురాళ్ల మధ్య పోటీ.. విషం తీసుకొని…
అర్ధరాత్రి రోడ్డుపై అనుకోని అతిథి.. భయంతో ఆగిపోయిన వాహనదారులు.. ఆ తర్వాత?
దిమ్మతిరిగే న్యూస్ ‘బ్రహ్మ రాక్షస్’ గా ప్రభాస్ | తండేల్‌కు లీకర్స్ బిగ్ ఝలక్

ఆచి.. తూచి.. అడుగు వెయ్యాలంటారు ఇందుకే..

కొంప ముంచిన కాఫీ.. ఏకంగా రూ.415 కోట్లు పరిహారం..

వేసవిలో బైక్ లు వాడుతున్నారా.. వీటితో జాగ్రత్త!

తాచుపాము కరిచినా..10వ తరగతి పరీక్ష రాసిన విద్యార్థి వీడియో

తెలుగు రాష్ట్రాల్లో బుసలు కొడుతున్న పాములు వీడియో

ఈ కోతికి ఫోన్ కనిపిస్తే చాలు.. వీడియో

ఎక్కడపడితే అక్కడ రీల్స్ చేస్తే ఇలాగే పగుల్తది..
