వామ్మో ఇదేం వరద..! ఏపీలో గులాబ్ తుఫాన్ ఎఫెక్ట్… ఏరులా పారుతున్న వరద నీరు…: Araku Ghat Road Video.

Araku Ghat Road: భారీ వర్షాలకు విశాఖ ఏజెన్సీలో ఘాట్ రోడ్లు ప్రమాదకరంగా మారాయి. అరకు ఘాట్ రోడ్ లో వరదనీరు ఏరులై ప్రవహిస్తుండగా.. పాడేరు ఘాట్ రోడ్ లో కొండచరియలు విరిగిపడుతున్నాయి. వర్షాలకు మట్టి కోతకు గురవడంతో బండరాళ్ళు కొండలపై నుంచి రోడ్లపైకి జారుతున్నాయి.

Anil kumar poka

|

Sep 30, 2021 | 6:58 AM

Araku Ghat Road: భారీ వర్షాలకు విశాఖ ఏజెన్సీలో ఘాట్ రోడ్లు ప్రమాదకరంగా మారాయి. అరకు ఘాట్ రోడ్ లో వరదనీరు ఏరులై ప్రవహిస్తుండగా.. పాడేరు ఘాట్ రోడ్ లో కొండచరియలు విరిగిపడుతున్నాయి. వర్షాలకు మట్టి కోతకు గురవడంతో బండరాళ్ళు కొండలపై నుంచి రోడ్లపైకి జారుతున్నాయి. వంజంగి కాంతమ్మ ఘాట్ రోడ్ లో కొండచరియలు విరిగిపడడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కొండచరియలు పడే సమయంలో అటువైపుగ వాహనాలు రాకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది.

ఘాట్ రోడ్ కు అడ్డంగా పడిన కొండచరియలను తొలగించేందుకు అధికారులు రంగంలోకి దిగారు. జేసీబీల సాయంతో రోడ్డుని క్లియర్ చేసే పని ప్రారంభించారు. ఈ పనులు కొనసాగుతుండగానే మరికొన్ని కొండచరియలు జారి అమాంతంగా పడిపోయాయి.జేసేబీపై కొండచరియలు పడడంతో అంతా పరుగులు తీశారు. రాళ్ళ ధాటికి భారోగా చెట్లు కూడా కూలి రోడ్డుపై పడ్డాయి. దీంతో సమస్య మళ్ళి మొదటికొచ్చింది. ఆ ప్రాంతంలో పరిస్థితి ప్రమాదకరంగా మారడంతో ఎవరూ రాళ్ళను తొలగించేందుకు సాహసం చేయడం లేదు. దీంతో పాడేరు ఘాట్ రోడ్ లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జాన్ అయింది.


మరిన్ని చదవండి ఇక్కడ : Janasena Pawan Kalyan: జనసేన విస్తృతస్తాయి సమావేశం.. మంగళగిరి పార్టీ కార్యాలయానికి చేసుకున్న పవన్ కళ్యాణ్(లైవ్ వీడియో)

 IPL 2021 : రాజస్థాన్ ఓడితే ఇంటికే.. ఈ మ్యాచ్‌లో గెలుపు ఎవరిని వరిస్తుంది..?(వీడియో)

 IPL 2021 : డేవిడ్ భాయ్ ఇక పరాయి వాడేనా..? హైదరాబాద్ జట్టుకు డేవిడ్ గుడ్ బై.?(వీడియో)

 Pawan kalyan Live Video: మంగళగిరికి జనసేనాని… మంగళగిరిలో ఏం జరుగుతుందోననే ఉత్కంఠ.. లైవ్ వీడియో..

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu