AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: రామ నామ జపం చేస్తూనే కుప్పకూలిన హనుమాన్‌ వేషధారి.! వీడియో వైరల్..

Viral: రామ నామ జపం చేస్తూనే కుప్పకూలిన హనుమాన్‌ వేషధారి.! వీడియో వైరల్..

Anil kumar poka
|

Updated on: Jan 24, 2024 | 5:11 PM

Share

అయోధ్య రామ మందిర ప్రాణప్రతిష్ట నేపథ్యంలో.. సోమవారం దేశమంతా భక్తిపారవశ్యంతో ఊగిపోయింది. పల్లె,పట్టణం తేడా లేకుండా రామ మందిర వేడుకల్ని ఘనంగా చేసుకున్నాయి. దేశం నలుమూలల పండుగ వాతావరణం కనిపించింది. ఆలయాల్లో బయటా.. అన్నదానాలు.. బాణాసంచా కాల్చి సంబురాలు.. రథయాత్రలు.. ఊరేగింపులు.. రామాయణ ఘట్టాల్ని నాటక రూపంలో ప్రదర్శనలు నిర్వహించారు.

అయోధ్య రామ మందిర ప్రాణప్రతిష్ట నేపథ్యంలో.. సోమవారం దేశమంతా భక్తిపారవశ్యంతో ఊగిపోయింది. పల్లె,పట్టణం తేడా లేకుండా రామ మందిర వేడుకల్ని ఘనంగా చేసుకున్నాయి. దేశం నలుమూలల పండుగ వాతావరణం కనిపించింది. ఆలయాల్లో బయటా.. అన్నదానాలు.. బాణాసంచా కాల్చి సంబురాలు.. రథయాత్రలు.. ఊరేగింపులు.. రామాయణ ఘట్టాల్ని నాటక రూపంలో ప్రదర్శనలు నిర్వహించారు. ఈ క్రమంలో హర్యానా భివానీలో నిర్వహించిన రామ్‌లీలాలో విషాదం చోటుచేసుకుంది. హర్యానాలోని భివానీలో రామాయణం నాటకాన్ని ప్రదర్శిస్తున్నారు. ఈ క్రమంలో స్టేజిపై సీతారాములను కీర్తిస్తున్నాడు హనుమంతుడు. శ్రీరాముడిపై తన ప్రేమను, శ్రీరాముని గొప్పదనాన్ని చాటిచెబుతూ పద్యాలు పాడుతున్నాడు. అలా భక్తిపారవశ్యంతో రామనామ కీర్తన చేస్తూనే ప్రాణాలు వదిలాడు. ఇదంతా చూస్తున్న ప్రేక్షకులు ఆయన నటనలో ఎంతగా లీనమైపోయారో అని తన్మయత్వంతో చూస్తుండిపోయారు. ఆయన నటనకు చప్పట్లు కొట్టారు. అయితే కుప్పకూలిన హనుమంతుడు పైకి లేవకపోవడంతో రాముడి వేషధారణలో ఉన్న నటుడు దగ్గరగా వెళ్లి చూసేసరికి చలనం లేకుండా పడి ఉన్నాడు. హుటాహుటిన ఆయన్ని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. మృతుడి పేరును హరీష్‌ మెహతాగా గుర్తించారు. విద్యుత్‌ శాఖలో జూనియర్‌ ఇంజినీర్‌గా పని చేసిన ఆయన పదవీ విరమణ పొందారు. గత పాతికేళ్లుగా ఆయన హనుమంతుడి వేషధారణతో అలరిస్తూ వస్తున్నారు. సోమవారం ఒకవైపు అయోధ్య ప్రాణప్రతిష్ట జరుగుతున్న సమమయంలో భివానీ జవహార్‌ చౌక్‌ వద్ద ఈ ఘటన చోటు చేసుకోవడంతో స్థానికంగా విషాదం అలుముకుంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos