భోజన ప్రియులకు ఫుడ్ టేస్ట్ తో పాటు ఆహారం కనిపించే విధానం కూడా ముఖ్యమే. అందుకే వారిని హోటల్ కు రప్పించేందుకు యాజమాన్యాలు వింత వింత వంటలను పరిచయం చేస్తున్నారు. అందులో కొన్ని ప్రజలకు రీచ్ అయితే, మరికొన్ని మాత్రం విరక్తి కలిగిస్తున్నాయి. అలాంటి ఫుడ్ వీడియోలు(Food Videos) సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇప్పటివరకు ఎన్నో కొత్త కొత్త వెరైటీ వంటలు(variety Recopies) అందుబాటులోకి వచ్చాయి. తాజాగా వెరైటీ వంటకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియా(Social Media)లో తెగ చక్కర్లు కొడుతుంది. ఇప్పటివరకు ఓరియో బిస్కెట్ పకోడి, చాక్లెట్ పానీపూరి, ఐస్ క్రీమ్ సమోసా, మ్యాగీ పెరుగు ఇలా కొత్త కొత్త రుచులు సామాజిక మాధ్యమాల్లో బాగానే వైరల్ అయ్యాయి. విచిత్రమైన వంటకాల పేర్లు వినగానే వెగటు పుట్టినా ఆశ్చర్యం కలిగిస్తాయి. అయితే కొత్తగా ఉండాలని చేసే ప్రయత్నాల ద్వారా దాని నుంచి కొన్నిసార్లు అద్భుతాలు బయటపడతాయి. అదే గులాబ్ జామూన్ పరాఠా.
గులాబ్ జామూన్ అనేది భారతీయ సాంప్రదాయ మిఠాయి. పెద్దల నుంచి చిన్న పిల్లల వరకు ప్రతి ఒక్కరూ దీనిని ఇష్టపడుతుంటారు. ఎంత డైట్ లో ఉన్నవారైనా దీనిని చూస్తే నోరు కట్టుకోలేరు. తమ నియమాలను పక్కన పెట్టి గుటుక్కుమనిపిస్తారు. అంతటి ప్రాముఖ్యత కలిగిన గులాబ్ జామూన్ తో ఓ వీధి వ్యాపారి విచిత్రమైన వంటను చేశాడు. పరాఠాలో గులాబ్ జామూన్ పెట్టి.. దానిని నెయ్యిలో వేయిస్తాడు. ఆ తర్వాత దానిపై గులాబ్ జామూన్ రసం వేసి ఇస్తాడు. ఈ వీడియోను ఇన్స్టాగ్రామ్లో ఫుడ్ బ్లాగర్ సోనియా నేగి షేర్చేశారు. ఈ వీడియోకు మిశ్రమ స్పందన లభిస్తోంది. ఈ వెరైటీ రెసిపీని చూసి కొందరు నెటిజన్లు అసహనం వ్యక్తం చేస్తుండగా.. మరి కొందరు బాగుందని కామెంట్లు చేస్తున్నారు.
Also Read
పొలిటికల్ హీట్ పెంచిన ఆయన పాదయాత్ర.. వేడి పుట్టిస్తున్న విమర్శలు, ప్రతి విమర్శలు
Janhvi Kapoor: 25వ పుట్టినరోజు శ్రీవారి సన్నిధిలో జరుపుకున్న జాన్వీ కపూర్.. లేటెస్ట్ ఫోటోస్ వైరల్