Guinnies Record: అతడి బలం చూసి గిన్నిస్ రికార్డ్‌కే వణుకు పుట్టింది..! గంటలో 194 సార్లు పైకెత్తాడు..
గిన్నిస్ రికార్డ్ కోసం అనేకమంది రకరకాల ప్రయత్నాలు చేస్తారు. కఠోరసాధనతో మొత్తానికి రికార్డు సాధిస్తారు కొందరు. అయితే ఇక్కడ ఓ వ్యక్తి గిన్నిస్ బుక్ నిర్వాహకులకే వణుకు పుట్టించాడు. సాధారణంగా ఓ 30 కిలోల బరువు ఉందనుకోండి. దాన్ని మీరు ఎన్నిసార్లు పైకెత్తగలరు?
గిన్నిస్ రికార్డ్ కోసం అనేకమంది రకరకాల ప్రయత్నాలు చేస్తారు. కఠోరసాధనతో మొత్తానికి రికార్డు సాధిస్తారు కొందరు. అయితే ఇక్కడ ఓ వ్యక్తి గిన్నిస్ బుక్ నిర్వాహకులకే వణుకు పుట్టించాడు. సాధారణంగా ఓ 30 కిలోల బరువు ఉందనుకోండి. దాన్ని మీరు ఎన్నిసార్లు పైకెత్తగలరు? మహా అంటే అతికష్టంమీద రెండుసార్లు పైకెత్తి కిందపడేయగలరు.. ఇక బాడీ బిల్డర్లయితే ఓ 20 లేదా 25 సార్లు పైకి కిందకి ఎత్తుతూ దించగలరు. కానీ ఇక్కడ ఓ వ్యక్తి ఏకంగా దాదాపు 90 కిలోల బండరాయిని 194 సార్లు అది కూడా ఒక్క గంటలో పైకి ఎత్తి, దించి చూపించాడు. అతని కండబలం చూసి గిన్నిస్ బుక్ నిర్వాకులు సైతం ఆశ్చర్యపోయారు. అమెరికాలోని బౌల్డర్ కౌంటీ హైజీన్ ఫైర్ ప్రొటెక్షన్ డిస్ట్రిక్ట్‌లో అగ్నిమాపక సిబ్బందిగా పనిచేసే డైలాన్ మిరాగ్లియా మంచి బాడీ బిల్డర్. ఇతనికి బరువులు ఎత్తి గిన్నిస్‌బుక్‌లో ఎక్కాలని కల. ఇందుకోసం ఎంతో సాధన చేశాడు. 87.6 కిలోల అట్లాస్ రాయిని గంటలో 194 సార్లు పైకెత్తాడు. గిన్నిస్ ప్రపంచరికార్డు నెలకొల్పాడు. ఈ ఫీట్ చూసి గిన్నిస్ బుక్ నిర్వాహకులు ఫిదా అయిపోయారు. అతన్ని ప్రశంసలతో ముంచెత్తారు.
మరిన్ని చూడండి ఇక్కడ:
Elephant-Lion: అః.. కుక్క మొరిగితే కొండకు సేట.. ఏనుగుపై సింహం దాడి.. కట్‌చేస్తే.. సీన్ రివర్స్
Viral Video: అవ్వ..! పెళ్లిలో వరుడి స్నేహితుడి నిర్వాకం.. ఏం చేస్తున్నాడో మీరే చూడండి..
Viral Video: వారేవా ఇది కదరా స్నేహమంటే.. దివ్యాంగుడిని భుజాలపై తిప్పిన గర్ల్స్.. వైరల్ వీడియో
Ram Charan-Urfi Javed: రామ్ చరణ్ కు పడిపోయిన.. బాలీవుడ్ శృంగార తార.. ఓపెన్ ఆఫర్ అంటూ ఇలా..
Viral Video: మరికొద్ది క్షణాల్లో పెళ్లి.. మండపంలోకి మాజీ ప్రియుడి ఎంట్రీతో సీన్ రివర్స్..