Student Thrashed: పాదాలను తాకలేదన్న కోపంతో విద్యార్థిని చావబాదిన టీచర్‌.!

Student Thrashed: పాదాలను తాకలేదన్న కోపంతో విద్యార్థిని చావబాదిన టీచర్‌.!

Anil kumar poka

|

Updated on: Apr 04, 2024 | 9:50 PM

పాదాలను తాకలేదన్న కోపంతో ఆరో తరగతి విద్యార్థిని ఉపాధ్యాయుడు చావబాదిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో జరిగింది, అంతటితో ఆగకుండా ఆ టీచర్.. కులం పేరుతో దూషించాడనీ బాధితుడి తండ్రి పోలీసులకి ఫిర్యాదు చేశారు. గత నెల 27న చోటుచేసుకున్న ఈ ఘటన బాధిత విద్యార్థి తండ్రి అకల్‌జీత్‌ ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది. ఆ మాస్టారు కొట్టడంతో తన కుమారుడు మనీశ్‌కు కంటి భాగంలో తీవ్రమైన గాయమైందని,

పాదాలను తాకలేదన్న కోపంతో ఆరో తరగతి విద్యార్థిని ఉపాధ్యాయుడు చావబాదిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో జరిగింది, అంతటితో ఆగకుండా ఆ టీచర్.. కులం పేరుతో దూషించాడనీ బాధితుడి తండ్రి పోలీసులకి ఫిర్యాదు చేశారు. గత నెల 27న చోటుచేసుకున్న ఈ ఘటన బాధిత విద్యార్థి తండ్రి అకల్‌జీత్‌ ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది. ఆ మాస్టారు కొట్టడంతో తన కుమారుడు మనీశ్‌కు కంటి భాగంలో తీవ్రమైన గాయమైందని, వీపు భాగంలో దెబ్బలు తగిలాయని అకల్‌జీత్‌లో ఫిర్యాదులో తెలిపారు. ఈ మేరకు ఉర్వా పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని మురార్‌పుర్‌ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు రవిశంకర్‌ పాండేపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు.

గత నెల 27న పాఠశాలలో తన పాదాలను తాకాల్సిందిగా మనీశ్‌ను పాండే కోరాడని, అందుకు మనీశ్‌ నిరాకరించాడని పోలీసులు తెలిపారు. దీంతో ఉపాధ్యాయుడు విద్యార్థిని కొట్టడంతోపాటు కులం పేరుతో దూషించాడని వివరించారు. గాయాలతో విలవిల్లాడుతూ మనీశ్‌ ఏడుస్తుండగా.. పాఠశాల నుంచి బహిష్కరిస్తానని కూడా ఉపాధ్యాయుడు బెదిరించినట్లు తెలిపారు. అకల్‌జీత్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదైందని, పోలీసులు ఈ విషయమై దర్యాప్తు చేస్తున్నారని ఎస్పీ జితేంద్రకుమార్‌ తెలిపారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.

ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.

‘నా భర్త VDలా ఉండాలి.!’ నో కన్ఫూజన్‌ తెలిసిన కాంబినేషనేగా..