Golgappa Bride: పుర్రెకో బుద్ధి జిహ్వకో రుచి అన్నారు పెద్దలు. అంటే ఒకొక్కరి ఆలోచన అభిరుచి ఒకొక్కలా ఉన్నట్లే.. ఒకొక్కరు ఒకొక్క ఆహార పదర్ధాలను, రుచిని తినడానికి ఇష్టపడతారు. నార్త్ ఇండియా నుంచి అడుగు పెట్టిన గోల్ గొప్పకు దేశ వ్యాప్తంగా అభిమానులున్నారు. కర కరలాడే చిన్నపాటి పూరీలను మధ్యలో రంధ్రం చేసి అందులో బంగాళాదుంప మసాలా ను పానీలో ముంచుకుని ఆరగిస్తారు. ఈ మసాలాను, పానీ ని విడిగా తయారు చేస్తారు. ఇవి ప్రాంతాలను బట్టి అందులో వాడే పదార్థాల్లో కొద్ది పాటి తేడాలుంటాయి. ఈ పానీ పూరీకి అమ్మాయిలైతే స్పెషల్ ప్రేమికులని చెప్పవచ్చు..
అలా ఓ భారతీయ యువతి తనకు పానీపూరి మీద ఉన్న ప్రేమను ఓ నవ వధువు స్పెషల్ గా తెలియజేసింది. పెళ్లి కూతురు పెళ్లి మండపంలో పూలదండలకు బదులు పానీ పూరికి ఉపయోగించే చిన్న చిన్న పూరీలను నగలుగా మార్చుకుంది.. పెళ్లి దండలు, కిరీటం వంటి ఆభరణాలుగా పూరీలతో చేసినవాటిని ధరించి తాను పానీ పూరికి గొప్ప ప్రేమికురాలినని ప్రపంచానికి చాటి చెప్పింది.
దక్షిణ భారత దేశానికి చెందిన అక్షర అనే నవ వధువు తన పెళ్లి రోజున గోల్గప్పలతో చేసిన నగలను ధరించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అంతేకాదు ఆమె ముందు ఉన్న ప్లేట్ కూడా గోల్గప్పలతో నిండి ఉంది.వధువు పెళ్లి పీటల మీద ఉన్నప్పుడు ఒక అతిధి వచ్చి గొల్గప్ప కిరీటాన్ని ఆమె తలపై ఉంచుతుంది. కిరీటం పెట్టిన తరవాత పెళ్లి కూతురు సంతోషంగా నవ్వడం ఈ వీడియో కనిపిస్తుంది.
Also Read: స్వీట్స్ షాప్ లో దొరికే విధంగా.. ఇంట్లోనే ఈజీగా టేస్టీగా పన్నీర్ తో రసగుల్లా తయారీ ..