రోడ్డుపై నడిచి వెళ్తున్న మహిళకు ఊహించని షాక్ !!
నగరంలో చైన్ స్నాచర్స్ రెచ్చిపోయారు. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలో గొలుసు లాక్కొని వెళ్లిపోయారు. హైదరాబాద్ లోని చైతన్యపురిలో చైన్ స్నాచింగ్ కలకలం రేపింది. స్థానిక అలకాపురి కాలనీలోని రోడ్ నంబర్ 8లో ఓ వృద్ధురాలు కిరాణా దుకాణానికి వెళ్తోంది. రోడ్డుపై జనసంచారం పెద్దగా లేదు. మహిళ రోడ్డుపై నడుచుకుండూ వెళ్తుండగా ఎదురుగా ఓ బైక్ వచ్చింది.
నగరంలో చైన్ స్నాచర్స్ రెచ్చిపోయారు. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలో గొలుసు లాక్కొని వెళ్లిపోయారు. హైదరాబాద్ లోని చైతన్యపురిలో చైన్ స్నాచింగ్ కలకలం రేపింది. స్థానిక అలకాపురి కాలనీలోని రోడ్ నంబర్ 8లో ఓ వృద్ధురాలు కిరాణా దుకాణానికి వెళ్తోంది. రోడ్డుపై జనసంచారం పెద్దగా లేదు. మహిళ రోడ్డుపై నడుచుకుండూ వెళ్తుండగా ఎదురుగా ఓ బైక్ వచ్చింది. ఆ బైక్ పై వచ్చిన వారిలో వెనుక కూర్చున్న వ్యక్తి మహిళ మేడలో చైన్ ను ఒక్కసారిగా లాగేసాడు. ఊహించని పరిణామానికి ఆ మహిళ షాకయింది. వెంటనే దొంగ దొంగ అంటూ ఆ బైక్ వెంట పరుగెత్తింది. అటుగా వాకింగ్ వచ్చిన మరో వ్యక్తికూడా దొంగలను పట్టుకునేందుకు ప్రయత్నించాడు. కానీ అప్పటికే వారు ఆ వీధి మలుపు దాటి వెళ్లిపోయారు. చేసేది లేక ఆ మహిళ పోలీసులను ఆశ్రయించింది. రెండున్నర లక్షల విలువచేసే మూడు తులాల గొలుసును దొంగలించి చైన్ స్నాచర్ పరారయ్యాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది వృద్ధురాలు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు చైతన్యపురి పోలీసులు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
హైదరాబాద్ పరిధిలో డీజేలపై నిషేధం.. గీత దాటితే.. ఎన్నేళ్ల జైలుశిక్షో తెలుసా ??
ఆహారం అందిస్తుండగా సింహం దాడి.. చివరకు ??
వామ్మో.. గర్ల్స్ హాస్టల్‌లో.. రాత్రి వేళ సీన్ ఇలా ఉంటుందా !!
అది ఓడనా ?? లేక ఆర్టీసీ బస్సా ?? అతనేం చేసాడో చూస్తే నవ్వాగదు
క్యాష్ ఆన్ డెలివరీపై రూ.లక్షన్నర ఐఫోన్ ఆర్డర్ !! డెలివరీ ఏజెంట్ ఇంటికొచ్చాక ??
టైలర్ లా మారి.. స్టూడెంట్స్ బట్టల రిపేర్లు చేస్తున్న టీచర్
పిల్లవాడిని స్కూలుకు తీసుకెళ్తున్న తల్లి.. పాపం అంతలోనే..
రాకెట్ల యుగంలోనూ ఎడ్లబండిపైనే జాతరకు..
పాపం గూగుల్ మ్యాప్‌కి ఏం తెలుసు.. వాళ్లు అలా చేస్తారని
డ్యూటీలో ఉన్న కానిస్టుబుల్‌కి రాత్రి 11 గంటలకు ఫోన్.. కట్ చేస్తే
యజమాని మరణించడంతో శోకసంద్రంలో శునకం..
ఆంధ్రా భోజనం రుచికి.. జపాన్ అధికారులు ఫిదా

