Viral video : మాములుగా ఎవరైనా పొరపాటున మన కాలు తొక్కితేనే మనకు ఎక్కడలేని కోపం వస్తుంది. కొంతమంది కోపాన్ని అదుపుచేసుకోలేక కొట్టేస్తుంటారు కూడా.. అదే ఒక పాము తోక తొక్కితే అది కాటు వేయకుండా ఉంటుందా.. కసితీరా కాటు వేసి జారుకుంటుంది. కొన్ని పాములు పగబట్టి మరీ కాటు వేస్తాయని అంటుంటారు పెద్దవాళ్ళు . అయితే ఇక్కడ మాత్రం ఓ పాము తోక తొక్కిన అది ఏం చేయకుండా వెళ్లిపోయింది. కారణం ఏంటంటే
ఇద్దరు చిన్నారు పరిగెత్తుతున్న సమయంలో వారి కాళ్ళ కిందకు ఓ త్రాచుపాము వచ్చింది. ఆసమయంలో ఓ చిన్నారి దాని తోకను తొక్కింది. దాంతో ఆ పాము కోపంతో కస్సున లేచి కాటువేయబోయింది. కానీ తాను తొక్కింది ఓ చిన్న పిల్ల అని గమనించిన ఆ పాము ఆ చిన్నారిని కాటువేయకుండా వెళ్లిపోయింది. ఈ సంఘటన ఎక్కడజరిగిందన్నది తెలియదు కానీ అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఆ పాపను పాము ఎందుకు కాటువేయలేదన్న దాని పై నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. చిన్నారులు దైవంతో సమానం అంటారు అందుకే ఆ పాము కాటేయలేదని కొందరు అంటున్నారు. ఏది ఏమైనా ఈ వీడియో మాత్రం తెగ వైరల్ అవుతుంది.
మరిన్ని ఇక్కడ చదవండి :
Viral video: ఆకలితో అలమటిస్తున్న నాగుపాముకు నీళ్లు పట్టించాడు.. హల్చల్ చేస్తున్న వీడియో..