Spitting On Rotis: బట్ట బయలు చేసిన వీడియో , మీరట్ లో అనుచిత చర్య, రోటీలు చేస్తూ ఉమ్మి వేసిన వ్యక్తి అరెస్ట్.
ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో జరిగిన ఓ పెళ్ళిలో తాండూరీ రోటీలు చేస్తూ వాటిపై ఉమ్మివేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. రొట్టెలను తాండూర్ లో వేసేముందు ఇతడు చేసిన ఈ అనుచిత, అపభ్రంశ చర్య తాలూకు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది..
ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో జరిగిన ఓ పెళ్ళిలో తాండూరీ రోటీలు చేస్తూ వాటిపై ఉమ్మివేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. రొట్టెలను తాండూర్ లో వేసేముందు ఇతడు చేసిన ఈ అనుచిత, అపభ్రంశ చర్య తాలూకు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇతడిని సోహైల్ గా గుర్తించారు. ఈ వర్కర్ చేసిన పనిని ఒకరు రహస్యంగా వీడియోగా చిత్రీకరించారు. ఇది సర్క్యులేట్ అవడంతో ఇతడిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ హిందూ జాగరణ్ మంచ్ సభ్యులు, కార్యకర్తలు మీరట్ లోని స్థానిక పోలీసు స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు అతడి కోసం గాలించి అరెస్టు చేశారు. అతనిపై ఎఫ్ ఐ ఆర్ దాఖలు చేశారు.
ఈ పెళ్లి విందులో సోహైల్ చేసిన పని నీచమైనదని, అమాయక జనాలను ఇది ఒకవిధంగా ‘ఛీట్’ చేయడమేనని హిందూ జాగరణ్ మంచ్ అధ్యక్షుడు సచిన్ సిరోహి అన్నారు. ఈ విధమైన ఘటనలను నివారించేందుకు పెళ్లిళ్లు వంటి శుభకార్యాలు జరిగే స్థలాల వద్ద సీసీటీవీ కెమెరాలు అమర్చాలని ఆయన సూచించారు.
थूककर रोटी बनाई…!कोविड जैसी भयावह बीमारी खत्म भी नही हुई और इस प्रकार की मानसिकता वाले लोग अपनी जाहिलीयत दिखाने से नही चूके।फिर @meerutpolice ने पकड़ा इन्हें। pic.twitter.com/9CQlLEPRmX
— Anamika Jain Amber (@anamikamber) February 21, 2021
Also Read:
లీటర్ పెట్రోల్ ఒక రూపాయి 45 పైసలు..:Liter Of Petrol is One Rupee 45 Paise Video.