అల్లం, వెల్లుల్లి ప్యాకెట్స్ కొంటున్నారా ?? అయితే మీ ఆరోగ్యం షెడ్ కు వెళ్ళినట్లే

అల్లం, వెల్లుల్లి ప్యాకెట్స్ కొంటున్నారా ?? అయితే మీ ఆరోగ్యం షెడ్ కు వెళ్ళినట్లే

Phani CH

|

Updated on: May 07, 2023 | 6:29 PM

సమ్మర్ కదా అని పిల్లలకు ఐస్ క్రీమ్‌లు కొనిస్తున్నాం.. ప్యాకింగ్ బాగుందని పాలు, నూనెలు కొంటున్నాం.. అల్లం వెల్లుల్లి పేస్ట్‌ చీప్‌గా వస్తుందని టెంప్ట్ అవుతున్నాం.. ఇలా చేస్తూ చేజేతులా మనం రిస్క్‌లో పడుతున్నాం. కల్తీ అల్లం వెల్లుల్లి, కల్తీ పాలు, కల్తీ ఐస్‌క్రీమ్‌లు, కల్తీ చాక్లెట్లు.. చిన్న పిల్లలు తింటారన్న ఇంగీతం లేదు..

సమ్మర్ కదా అని పిల్లలకు ఐస్ క్రీమ్‌లు కొనిస్తున్నాం.. ప్యాకింగ్ బాగుందని పాలు, నూనెలు కొంటున్నాం.. అల్లం వెల్లుల్లి పేస్ట్‌ చీప్‌గా వస్తుందని టెంప్ట్ అవుతున్నాం.. ఇలా చేస్తూ చేజేతులా మనం రిస్క్‌లో పడుతున్నాం. కల్తీ అల్లం వెల్లుల్లి, కల్తీ పాలు, కల్తీ ఐస్‌క్రీమ్‌లు, కల్తీ చాక్లెట్లు.. చిన్న పిల్లలు తింటారన్న ఇంగీతం లేదు.. ప్రాణాలు పోతాయన్న ఆలోచన లేదు.. గల్లాపెట్టె నిండాలన్న కక్కుర్తితో కొంతమంది కేటుగాళ్లు ప్రజారోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు. వరుసగా వెలుగులోకొస్తున్న నకిలీలలు.. జనాన్ని వణికిస్తున్నాయి. ఏది తినాలి.. ఏది తినకూడదన్న ఆలోచనలో పడిపోతున్నారు. కాదేదీ కల్తీకి అనర్హం అంటూ కల్తీ రాయుళ్లు మనం తినే ఆహార పదార్ధాలను యధేచ్చగా కల్తీ చేస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు. కందిపప్పులో కేసరి పప్పు.. పాలు చిక్కగా కన్పించేందుకు బియ్యం పిండి కలుపుతున్నారు. శనగపిండి, ధనియాల పొడి, కారం పొడి, వక్కపొడి, నెయ్యి, పంచదార, ఐస్‌క్రీమ్‌, చాక్లెట్లు, కాఫీ, టీ పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, వంటనూనెలు ఇలా మనం తీసుకునే ప్రతి ఆహార పదార్థంలోనూ కల్తీ రాజ్యమేలుతోంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వామ్మో.. ఆ మహిళ బ్యాగునిండా పాములే..

శాడిస్ట్‌ మేకపిల్ల.. ఏం చేసిందో చూస్తే నవ్వకుండా ఉండలేరు

వింత తాబేలు.. దీన్ని చూస్తే అదిరిపడతారు..

యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న నాగచైతన్య కస్టడీ ట్రైలర్..

Niharika Konidela: యంగ్ హీరోతో స్టెప్పులేసిన నిహారిక..