మన్యం గిరుల్లో వికసించిన అరుదైన పుష్పాలు
అల్లూరి జిల్లా ఏజెన్సీ గిరుల్లో మే ప్లవర్స్ కనువిందుచేస్తున్నాయి. ఏడాదికి ఒక్కసారి మాత్రమే వికసించే ఈ అరుదైన పుష్పాలు ఇవి. అదికూడా కేవలం మే నెల రెండో వారంలోనే అతిధిలా కనిపించే ఈ పుష్పాలు ఈసారి ఒక వారంముందే పూసాయి. గుబురుగా బంతి ఆకారంలో ఎర్రటి వర్ణంతో అందరినీ ఆకట్టుకుంటున్నాయి.
అల్లూరి జిల్లా ఏజెన్సీ గిరుల్లో మే ప్లవర్స్ కనువిందుచేస్తున్నాయి. ఏడాదికి ఒక్కసారి మాత్రమే వికసించే ఈ అరుదైన పుష్పాలు ఇవి. అదికూడా కేవలం మే నెల రెండో వారంలోనే అతిధిలా కనిపించే ఈ పుష్పాలు ఈసారి ఒక వారంముందే పూసాయి. గుబురుగా బంతి ఆకారంలో ఎర్రటి వర్ణంతో అందరినీ ఆకట్టుకుంటున్నాయి. బంతి, చామంతి, గులాబి, కనకాంబరం, మల్లే, లిల్లి.. ఇలా ఎన్ని పూలు పెరట్లో పూచినా… మే నెలలో పూచే ఈ అరుదైన పుష్పాల లుక్కే వేరు. కోవిడ్ తర్వాత ఈ పువ్వులు మరింత ప్రాచుర్యంలోకి వచ్చాయి. ఈ పూలను చూసిన చిన్నారులు… సరదాగా కరోనా వైరస్ పువ్వులని పిలుస్తున్నారు. ఈ పూల ఆకారం.. కొవిడ్ వైరస్ ఆకారంలో సరిపోలి ఉండడంతో సరదాగా అలా పిలుస్తున్నారు. స్కాడొక్సస్ మల్టీ ఫ్లోరస్ జాతికి చెందిన ఈ మే పూలు ఆఫ్రికా, సౌదీ అరేబియా, ఆంధ్ర ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తాయి. బ్లడ్ లిల్లీ, బాల్ లిల్లీ, ఫైర్ బాల్ లిల్లీ అని అనే పేర్లతో కూడా ఈ పూలను పిలుస్తుంటారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Samantha: సమంతపై టెన్నిస్ స్టార్ ప్రశంసలు.. ఎందుకంటే ??
Keerthy Suresh: ముఖంపై గాయాలతో మహానటి.. కీర్తి సురేష్‌కు ఏమైంది ??