Viral Video : పాఠశాల బస్సుకోసం ఎదురు చూస్తున్న పదొకొండేళ్ల బాలికను గుర్తు తెలియని దుండగుడు కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించాడు. కానీ ఆ బాలిక అతడితో పోరాడి తప్పించుకున్న తీరు అందరిని ఆశ్చర్యపరిచింది. ఉదయం 7 గంటలకు ఫ్లోరిడాలోని వెస్ట్ పెన్సకోలాలో జరిగిన ఈ భయానక సంఘటన అక్కడ ఉన్న నిఘా కెమెరాలో రికార్డ్ అయింది. దీంతో ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఎస్కాంబియా కౌంటీ షెరీఫ్ చిప్ సిమన్స్ ధైర్య పోరాటం చేసినందుకు ఆ అమ్మాయిని ప్రశంసించారు. ఒక్కసారిగా దుండగుడు వచ్చి పట్టుకునేసరికి ఆమె చాలా భయపడింది కానీ పోరాడింది. అతడిని కాలుతో తన్నడం ప్రారంభించింది. చేతులతో నెట్టివేసింది. పిడికిలి బిగించి కొట్టింది. ఆమె ధైర్యం అద్భుతం అని ప్రశంసించారు. ఆ అమ్మాయి ప్రతిఘటించడంతో దుండగుడు కారు వద్దకు పరిగెత్తి వెళ్లిపోయాడు. ఈ కేసుకు సంబంధించి ఒక వ్యక్తిని అరెస్టు చేసినట్లు షెరీఫ్ తెలిపారు. నిందితుడు కత్తితో వచ్చాడని, తెలుపు డాడ్జ్ పికప్ ట్రక్కును నడుపుతున్నట్లు ధ్రువీకరించారు.
నిఘా ఫుటేజ్‌లో కారు స్పష్టంగా కనిపిస్తుంది. పోలీసులు నిందితుడిని గుర్తించగలిగారు. తరువాత ఈ వ్యక్తిని 30 ఏళ్ల జారెడ్ పాల్గా గా గుర్తించారు. అతను చాలా నేర ప్రవృత్తి గలవాడు. సరిగ్గా ఈ సంఘటనకు కొన్ని వారాల ముందు బాలిక అదే వ్యక్తిని ఎదుర్కొంది. కానీ ఆ సమయంలో అతను ఆమెతో స్పానిష్ భాషలో మాట్లాడటానికి ప్రయత్నించాడు. ఆ రోజు నుంచి అమ్మాయి తన తల్లితో కలిసి బస్ స్టాప్‌కి వెళుతోంది. కానీ అపహరణకు ప్రయత్నించిన రోజు ఆమె ఒంటరిగా ఉంది.