ష్.. నేనూ ఇక్కడే పడుకుంటా.. డిస్టర్బ్ చెయ్యొద్దు..

Phani CH

Phani CH |

Updated on: Oct 03, 2022 | 9:32 AM

ఇంటర్నెట్ ప్రపంచంలో నిత్యం ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. సోషల్ మీడియాలో ఈ వీడియోలు వచ్చి రాగానే నెటిజన్లను తెగ ఆకట్టుకుంటాయి. తాజాగా..

 ఇంటర్నెట్ ప్రపంచంలో నిత్యం ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. సోషల్ మీడియాలో ఈ వీడియోలు వచ్చి రాగానే నెటిజన్లను తెగ ఆకట్టుకుంటాయి. తాజాగా.. ఒక అందమైన వీడియో ఇంటర్నెట్‌లో హృదయాలను గెలుచుకుంటోంది. ఒక బొరియలాంటి ప్లేస్లో కొన్ని బాతుపిల్లలు ఉన్నాయి. అవి ఎంతో అందంగా ఆడుకుంటూ ఉన్నాయి. ఇంతలో అక్కడికి ఓ చిన్న కుక్కపిల్ల వచ్చింది. ఆ బాతుపిల్లలన్నిటిని పక్కకు లాగేసి… నేనూ మీతోనే బజ్జుంటాను.. నన్ను డిస్టర్బ్‌ చేయొద్దు అంటూ అక్కడే పడుకుంది. ఈ బాతు పిల్లలు కూడా తమ స్నేహితుడికి ఏమాత్రం నిద్రా భంగం కలగకుండా చక్కగా దాని వీపుపైన, తలపైన ఎక్కి నిద్రపోయాయి. ఈ సన్నివేశం చూడ్డానికి ఎంతో క్యూట్‌గా ఉంది. వీటీ స్నేహం చూసి నెటిజన్లు ముగ్ధులైపోతున్నారు. ట్విట్టర్‌లో షేర్‌ చేసిన ఈ వీడియో ఇంటర్నెట్‌లో సంచలనంగా మారింది. ఈ వీడియోను మిలియన్ల మంది వీక్షించగా లక్షల్లో లైక్‌ చేశారు. అంతేకాకుండా ఈ వీడియోను రీట్వీట్ చేస్తూ నెటిజన్లు బ్యూటిఫుల్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియో చాలా అందంగా ఉందంటూ కొనియాడుతున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఓర్నీ.. నీ తెలివి తెల్లారిపోనూ.. సీటు కోసం అంత నాటకమా ??

ఇకపై వాట్సాప్‌ మెసేజ్‌ను ఎడిట్‌ చేసుకోవచ్చు.. ఎలా అంటే ??

ఫుడ్ కోసం పక్కా స్కెచ్.. నోటికందగానే సూపర్‌ ట్విస్ట్ ఇచ్చిన కుక్క..

క్లాస్‌ రూమ్‌లో బాలిక స్కూల్‌ డ్రెస్‌ విప్పించిన టీచర్.. పైగా ఫోటోలు షేర్

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu