క్లాస్ రూమ్‌లో బాలిక స్కూల్ డ్రెస్ విప్పించిన టీచర్.. పైగా ఫోటోలు షేర్
మధ్యప్రదేశ్‌లో దారుణం వెలుగు చూసింది. క్లాస్‌రూమ్‌లో ఓ టీచర్ విద్యార్థిని పట్ల.. అనుచితంగా ప్రవర్తించాడు. స్కూల్ డ్రెస్ మురికిగా ఉందని.. ఆగ్రహించి అందరి ముందు ఆమె డ్రెస్ విప్పించాడు.
మధ్యప్రదేశ్‌లో దారుణం వెలుగు చూసింది. క్లాస్‌రూమ్‌లో ఓ టీచర్ విద్యార్థిని పట్ల.. అనుచితంగా ప్రవర్తించాడు. స్కూల్ డ్రెస్ మురికిగా ఉందని.. ఆగ్రహించి అందరి ముందు ఆమె డ్రెస్ విప్పించాడు. దాంతో పాప కొన్ని గంటల పాటు దుస్తులు లేకుండా క్లాసులో కూర్చుండిపోయింది. అయితే ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవడంతో.. ఆ ఉపాధ్యాయుడిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. షాడోల్ జిల్లాలోని గిరిజన గ్రామంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. గిరిజన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో క్లాస్‌కు వచ్చిన ఐదో తరగతి చదువుతున్న పదేళ్ల బాలిక స్కూల్ డ్రెస్ మురికిగా ఉందని .. ఉపాధ్యాయుడు శ్రవణ్ కుమార్ త్రిపాఠి గమనించాడు. ఆమెపై కోపగించుకున్నాడు. ఆ తర్వాత అందరి ముందు తరగతి గదిలో ఆమె దుస్తులను విప్పించాడు. తర్వాత ఆ బట్టలను స్వయంగా టీచర్ శ్రవణ్ కుమారే ఉతికాడు. అయితే డ్రెస్ ఆరేంత వరకు ఆ బాలిక క్లాస్ రూమ్‌లో లో దుస్తులతోనే కూర్చొంది. కొన్ని గంటల పాటు లో దుస్తులతోనే క్లాస్‌రూమ్‌లో ఉండాల్సి వచ్చింది. పైగా ఆ పాప ఫోటోలను తీసి.. తనను తాను పరిశుభ్రత వాలంటీర్‌గా పేర్కొంటూ వాటిని వాట్సాప్ గ్రూప్‌లో పోస్ట్ చేశాడు. ఇలా షేర్ చేసిన వెంటనే ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. విషయం ఉన్నతాధికారులకు తెలిసి చర్యలు చేపట్టారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Srivari Brahmotsavam 2022: సూర్యప్రభ వాహనంపై మలయప్ప స్వామి..
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్‌న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

