ఇకపై వాట్సాప్ మెసేజ్‌ను ఎడిట్ చేసుకోవచ్చు.. ఎలా అంటే ??
వాట్సాప్ మెసేజింగ్ యాప్‌కు ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యూజర్ల అవసరాలకు అనుగుణంగా కొంగొత్త ఫీచర్లతో ఆకట్టుకుంటోంది కాబట్టే ఈ యాప్‌కు అంతటి ప్రాధాన్యత.
వాట్సాప్ మెసేజింగ్ యాప్‌కు ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యూజర్ల అవసరాలకు అనుగుణంగా కొంగొత్త ఫీచర్లతో ఆకట్టుకుంటోంది కాబట్టే ఈ యాప్‌కు అంతటి ప్రాధాన్యత. ఇప్పటికే పలు ఆకట్టుకునే ఆఫర్లతో యూజర్లను అట్రాక్ట్ చేస్తూ వస్తోన్న వాట్సాప్ తాజాగా మరో ఆకస్తికరమైన ఫీచర్‌ను తీసుకొచ్చింది. సాధారణంగా వాట్సాప్‌లో ఎవరికైనా మెసేజ్ చేస్తే ప్రస్తుతం డిలీట్ చేసుకునే అవకాశం మాత్రమే ఉంది. అలా కాకుండా అప్పటికే సెండ్ చేసిన మెసేజ్‌ను ఎడిట్ చేసే అవకాశం ఉంటే ఎలా ఉంటుంది.? తాజాగా వాట్సాప్ ఈ ఫీచర్‌పై టెస్టింగ్ చేస్తోంది. తొందరపాటులో పంపిన మెసేజ్‌లో ఏవైనా తప్పులు దొర్లితే.. ఇకపై మెసేజ్‌ను డిలీట్ చేసి, మళ్లీ కొత్త మెసేజ్ పంపాల్సిన అవసరం లేకుండా ఈ కొత్త ఫీచర్ ఉపయోగపడనుంది. ఎడిట్ మెసేజ్ ఫీచర్ పేరుతో తీసుకొస్తున్న ఈ అప్‌డేట్ ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉంది. విజయవంతంగా పరీక్షలు పూర్తికాగానే యూజర్లందరికీ అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇదిలా ఉంటే వాట్సాప్ ఇటీవలే డిలిట్ ఫర్ ఎవ్రీవన్ ఫీచర్ సమయాన్ని పెంచిన విషయం తెలిసిందే. వీటితో పాటు ప్రైవసీలో భాగంగా ప్రొఫైల్ ఫొటో ఎవరికి కనిపించాలో వారికే కనిపించేలా చేసుకునే అవకాశం కూడా కల్పించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఫుడ్ కోసం పక్కా స్కెచ్.. నోటికందగానే సూపర్ ట్విస్ట్ ఇచ్చిన కుక్క..
క్లాస్ రూమ్‌లో బాలిక స్కూల్ డ్రెస్ విప్పించిన టీచర్.. పైగా ఫోటోలు షేర్
మతిస్థిమితం లేని వ్యక్తి చేసిన పని.. చావు దాకా వెళ్లిన చిన్నారులు
లిఫ్ట్ ఓపెన్.. మంగళసూత్రం ఖతం !!
అద్భుతం.. సాగర గర్భంలో త్రివర్ణపతాక ధగధగలు
సైగలతోనే బధిర బాలల జాతీయ గీతం
మూగజీవాలపై ఎందుకింత కసి ?? జంతు ప్రేమికుల నిరసన
లవర్ భార్యకు HIV ఇంజెక్షన్.. మాజీ ప్రియురాలి దారుణం
తల్లి ప్రేమ అంటే ఇదే.. కన్నీటి పర్యంతమైన తల్లి ఆవు

