Dogs Viral Video: యజమాని బయటికెళ్లగానే.. ఈ కుక్కలు ఏం చేశాయో చూడండి..!

Updated on: Apr 23, 2022 | 9:41 AM

విశ్వాసానికి ప్రతీక అయిన కుక్క.. మనల్ని, మన ఇంటిని కంటికి రెప్పలా కాపాడుతుంది. ఇది జగమెరిగిన సత్యం. కానీ ఇప్పుడు కాలం మారింది. కుక్కల ఆలోచనా మారింది.. ఎప్పడూ మిమ్మల్ని, మీ ఇంటిని కాపాడటమే మా పనా..


విశ్వాసానికి ప్రతీక అయిన కుక్క.. మనల్ని, మన ఇంటిని కంటికి రెప్పలా కాపాడుతుంది. ఇది జగమెరిగిన సత్యం. కానీ ఇప్పుడు కాలం మారింది. కుక్కల ఆలోచనా మారింది.. ఎప్పడూ మిమ్మల్ని, మీ ఇంటిని కాపాడటమే మా పనా.. మాకూ సరదాలు.. సంతోషాలు ఉంటాయి.. అంటున్నాయి ఈ కుక్కలు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. యజమాని ఇంటినుంచి వెళ్లిపోవడమే ఆలస్యం.. మాదే సామ్రాజ్యం అన్నట్లు తెగ రచ్చ చేసేస్తున్నాయ్.వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో రెండు కుక్కలు ఇంట్లో స్వేచ్ఛగా ఆడుకుంటున్నాయి. చూస్తుంటే ఇంట్లో వాళ్లు బయటకెళ్లినట్టుగా ఉంది. దాంతో ఇంక మాదే రాజ్యం అన్నట్టుగా ఎంతో సరదాగా ఆడుకుంటున్నాయి. పోలీసు ట్రైన్డ్‌ శునకాలను మించి స్టంట్స్‌ చేసేస్తున్నాయి. ఒక టేబుల్‌ పైనుంచి ఇంకో టేబుల్‌ పైకి ఎగిరి.. అక్కడ్నుంచి పైన సీలింగ్‌కు వేలాడుతున్న తాళ్లను తమ నోటితో పట్టుకొని ఉయ్యాల ఊగినట్టుగా ఊగుతూ తెగ ఎంజాయ్‌ చేస్తున్నాయి. ఈ వీడియోను ఓ యూజర్‌ ట్విట్టర్‌లో షేర్ చేశారు. ‘ఇప్పటికి యజమాని బయటకువెళ్లాడు.’ అంటూ క్యాప్షన్ కూడా పెట్టారు. ఈ వీడియోను చూసి నెటిజన్లు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. కడుపుబ్బా నవ్వుకుంటున్నారు. ఈ వీడియోను మిలియన్లమంది వీక్షిస్తూ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని చూడండి ఇక్కడ:

David Warner-Pushpa: వారేవా..! మ్యాచ్ మధ్యలో పుష్ప సినిమా చూపించిన డేవిడ్ భాయ్.. తగ్గేదే లే..

Monkey Funny video: మొద‌టిసారి డ్రాగ‌న్ ఫ్రూట్ తిన్న పిల్లకోతి రియాక్షన్‌.. నెట్టింట నవ్వులు పూయిస్తున్న వీడియో

Viral Video: సంగీత్‌ ఫంక్షన్‌లో డాన్స్‌ అదరగొట్టిన నవ వధువు..! అదిరిపోయే స్టెప్పులకు కామెంట్లతో ఆశీర్వచనాలు

Elephant-Lion: అః.. కుక్క మొరిగితే కొండకు సేట.. ఏనుగుపై సింహం దాడి.. కట్‌చేస్తే.. సీన్‌ రివర్స్‌

kacha badam Singer: తత్వం బోధపడింది.. నేనేంటో తెలిసొచ్చింది.. కచ్చా బాదామ్‌ సింగర్‌ మాటలు వింటే షాక్…

Viral Video: అవ్వ..! పెళ్లిలో వరుడి స్నేహితుడి నిర్వాకం.. ఏం చేస్తున్నాడో మీరే చూడండి..