Viral Video: పాముతోనే పరచకాలా..? కట్ చేస్తే దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది.. చూస్తే ఫ్యూజులౌట్..!

Snake Attack Video: పాములు ఎంత ప్రమాదకరమో మనందరికీ బాగా తెలుసు. విషపూరిత పాములు కాటేస్తే నిమిషాల్లోనే బాధితుల ప్రాణం పోతుంది. అందుకే పాములకు

Viral Video: పాముతోనే పరచకాలా..? కట్ చేస్తే దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది.. చూస్తే ఫ్యూజులౌట్..!
Viral Video
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Apr 23, 2022 | 8:50 AM

Snake Attack Video: పాములు ఎంత ప్రమాదకరమో మనందరికీ బాగా తెలుసు. విషపూరిత పాములు కాటేస్తే నిమిషాల్లోనే బాధితుల ప్రాణం పోతుంది. అందుకే పాములకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదంటూ పలువురు పేర్కొంటుంటారు. అయితే ఈ రోజుల్లో పాములకు సంబంధించిన అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇది చూసిన తర్వాత మీరు కూడా ఇదే చెబుతారు. ఎందుకంటే.. ఓ యువకుడు ప్రమాదకరమైన పాముతో సరదాగా ఆడుకుంటూ ఫోజులిస్తుంటాడు. ఈ క్రమంలో పాము యువకుడికి దిమ్మతిరిగే షాక్ ఇస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట (social media) తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసి అందరూ షాకవుతున్నారు.

వైరల్‌గా మారిన ఈ వీడియో ఫ్యాక్టరీలో చిత్రీకరించారు. ఈ వీడియోలో ఓ వ్యక్తి చేతిలో పామును పట్టుకుని కనిపించడాన్ని చూడవచ్చు. పాము కూడా చిన్నది కాదు.. చాలా పెద్దది. కానీ అబ్బాయి చాలా సరదాగా దానితో ఆడుకుంటూ కనిపిస్తాడు. ఈ క్రమంలో పామును బలవంతంగా తన తల దగ్గరికి తీసుకెళతాడు. యువకుడి ఈ చర్య వల్ల పాముకి కూడా చాలా కోపం వస్తుంది. పాము మెడ పట్టుకుని ఉండడంతో.. అది ఏమీ చేయలేకపోతోంది. అయితే యువకుడు కాస్త పట్టు సడలిన వెంటనే పాము అతనిపై దాడి చేసింది. తలపై నోటితో గట్టిగా కాటేస్తుంది.

ఈ దృశ్యం నిజంగా ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది. దీని తరువాత యువకులు దాని నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తాడు. కానీ పాము అతనిని విడిచిపెట్టదు. ఈ వీడియో చూసి చాలామంది భయపడుతూ పలు రకాల కామెంట్లు చేస్తున్నారు. అందుకే.. పాములకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని పేర్కొంటున్నారు.

వైరల్ వీడియో..

View this post on Instagram

A post shared by TYRESE (@tyrese)

యువకుడు.. పాముకు సంబంధించిన ఈ షాకింగ్ వీడియోను హాలీవుడ్ నటుడు టైరీస్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పంచుకున్నారు. దీన్ని 10లక్షల మందికిపైగా వీక్షించగా.. వేలాది మంది లైక్ కూడా చేశారు. దీంతోపాటు పలు రకాల కామెంట్లు చేస్తున్నారు.

Also Read:

Optical Illusion: ఈ ఫోటోలో మీకు మొదట ఏం కనిపించిందో అదే మీ లవ్ లైఫ్ చెప్పేస్తుంది.. మీకు ఎలాంటి భాగస్వామిని కోరుకుంటారంటే.. ..

Viral Video: నిమ్మకాయ ధర కొండెక్కితే రియాక్షన్‌ ఇట్లే ఉంటుంది.. నవ్వులు పూయిస్తోన్న వైరల్‌ వీడియో..