AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దేవభూమిలో ఆగని విలయం.. కుంభవృష్టిలో చిక్కుకున్న 2500 మంది పర్యాటకులు వీడియో

దేవభూమిలో ఆగని విలయం.. కుంభవృష్టిలో చిక్కుకున్న 2500 మంది పర్యాటకులు వీడియో

Samatha J
|

Updated on: Sep 18, 2025 | 4:22 PM

Share

భారీ వర్షాలు, క్లౌడ్ బరస్ట్‌లతో ఈశాన్య రాష్ట్రాలు అతలాకుతలమవుతున్నాయి. డెహ్రడూన్‌లో కుంభవృష్టి సృష్టించిన విలయంనుంచి ఇంకా కోలుకోని చమోలీ జిల్లాలో మరో పెనువిపత్తు సంభవించింది. నందా నగర్‌లో భారీ కుంభవృష్టి కురిసింది. దీంతో పలు భవనాలు పూర్తిగా నేలమట్టం అయ్యాయి. ఐదుగురు గల్లంతయినట్టు తెలుస్తోంది. దీంతో అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 20 వరకు డెహ్రాడూన్, చంపావత్, ఉధమ్ సింగ్ నగర్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.

అత్యంత భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని హెచ్చరించింది.భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటంతో డెహ్రాడూన్ నుంచి ముస్సోరికి వెళ్లే ప్రధాన రహదారి మూసివేశారు. దీంతో సుమారు 2,500 మంది పర్యాటకులు ముస్సోరీలో చిక్కుకుపోయారు. కుంభవృష్టి కారణంగా పలుగా రోడ్లు, వంతెనలు దెబ్బతిన్నాయి. పర్యాటకులు బసచేసిన చోటినుంచి బయటకు రావద్దని పోలీసులు సూచించారు. ఈ నేపథ్యంలో ‘ముస్సోరీ హోటల్ యజమానుల సంఘం’ మానవతా దృక్పథంతో స్పందించింది. అనుకోకుండా బస చేయాల్సి వచ్చిన పర్యాటకులకు ఒక రాత్రి ఉచితంగా వసతి కల్పిస్తామని ప్రకటించింది.ఈ విపత్తుపై ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి స్పందించారు. “దెబ్బతిన్న మౌలిక సదుపాయాలను వెంటనే పునరుద్ధరిస్తామని తెలిపారు. ఇప్పటికే 85 శాతం విద్యుత్ లైన్లను పునరుద్ధరించామని, త్వరలోనే మిగిలినవి కూడా పూర్తి చేస్తామని చెప్పారు. సహాయక బృందాలు దాదాపు 1000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాయని వివరించారు. డెహ్రాడూన్-ముస్సోరీ మార్గంలో రాకపోకలను పునరుద్ధరించేందుకు కొల్హుఖేత్ వద్ద సైన్యం తాత్కాలిక బైలీ వంతెనను నిర్మిస్తున్నట్టు తెలిపారు.

మరిన్ని వీడియోల కోసం :

సెలవులొచ్చాయ్..స్కూళ్లకు దసరా సెలవులు ప్రకటించిన ప్రభుత్వం వీడియో

ఆమె అరుపు విని కాకులే మోసపోయాయిగా..వీడియో

చెదిరిన కల.. అమెరికాలో విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరం వీడియో

ఇందేంట్రా బాబు ఆకాశంలో రెండు చందమామలు.. మీరూ చూడండి మరి !

Published on: Sep 18, 2025 04:20 PM