ఒకే రోజు రూ.2 కోట్లు.. దోచుకున్న సైబర్​ నేరగాళ్లు

సైబర్ నేరగాళ్లు రూట్ మారుస్తున్నారు..బాగా చదువుకుని, ఉన్నత స్థానాల్లో పనిచేస్తున్నవారినే టార్గెట్ చేస్తూ మోసాలకు పాల్పడుతున్నారు..సోషల్‌ మీడియాను సైతం శాసించే సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్ల్ కూడా అత్యాశకు పోయి సైబర్‌ నేరగాళ్ల వలలో చిక్కుతున్నారు. వాళ్లు చెప్పే మాయమాటలను గుడ్డిగా నమ్ముతు.. ఎటువంటి ఎంక్వైరీ లేకుండా ఏకంగా ఓటీపీలను సైతం చెప్పేస్తున్నారు. సంపాదించిన సొమ్మునంతా ఆ కేటుగాళ్ల చేతుల్లో పెడుతున్నారు.

ఒకే రోజు రూ.2 కోట్లు.. దోచుకున్న సైబర్​ నేరగాళ్లు

|

Updated on: Jul 30, 2024 | 8:08 PM

సైబర్ నేరగాళ్లు రూట్ మారుస్తున్నారు..బాగా చదువుకుని, ఉన్నత స్థానాల్లో పనిచేస్తున్నవారినే టార్గెట్ చేస్తూ మోసాలకు పాల్పడుతున్నారు..సోషల్‌ మీడియాను సైతం శాసించే సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్ల్ కూడా అత్యాశకు పోయి సైబర్‌ నేరగాళ్ల వలలో చిక్కుతున్నారు. వాళ్లు చెప్పే మాయమాటలను గుడ్డిగా నమ్ముతు.. ఎటువంటి ఎంక్వైరీ లేకుండా ఏకంగా ఓటీపీలను సైతం చెప్పేస్తున్నారు. సంపాదించిన సొమ్మునంతా ఆ కేటుగాళ్ల చేతుల్లో పెడుతున్నారు. ఆ తర్వాత మోసపోయామని గ్రహించి విలవిల్లాడుతున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇలాంటి ఇన్సిడెంట్ ఒకటి జరిగింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో సైబర్ నేరగాళ్ల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో రెచ్చిపోయిన సైబర్ నేరగాళ్లు ఒక్క రోజే ముగ్గురి నుంచి రెండు కోట్ల రూపాయలకు పైగా కాజేశారు. పటాన్ చెరులో నాగార్జున అనే వ్యక్తిని లేడి వాయిస్ తో బురిడీ కొట్టించి 99 లక్షల 80 వేలు కాజేసిన సైబర్ నేరస్తులు.. అమీన్ పూర్ లో నివాసం ఉండే ఓ ప్రయివేటు ఉద్యోగి నుంచి 98 లక్షల 40 వేలు మాయం చేశారు. అలాగే తూప్రాన్ లో ఓ యువతికి తెలియకుండానే లోన్ తీసుకుని అకౌంట్ నుంచి 5 లక్షల రూపాయలను వారి అకౌంట్ లోకి ట్రాన్స్ ఫర్ చేసుకున్నారు సైబర్ నిందితులు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మహిళల్లో ఈ లక్షణాలు కనిపిస్తే అలర్ట్ అవ్వాల్సిందే

క్రెడిట్ కార్డుకు మినిమమ్ బిల్ మాత్రమే కడుతున్నారా ??

ఆ సిటీలో వాహనంలో కన్నా.. నడుస్తూనే త్వరగా వెళ్లొచ్చట

9 టు 5 ఉద్యోగాలు ఇక ఉండవట !! మారనున్న ఉద్యోగాల తీరుతెన్నులు

రెండో దశలో పెరిగిన దూరం.. కోకాపేట వరకు మెట్రో రైలు

Follow us