ఆ సిటీలో వాహనంలో కన్నా.. నడుస్తూనే త్వరగా వెళ్లొచ్చట
దేశంలోని జన సమ్మర్ద నగరాల్లో బెంగళూరు ఒకటి. పైగా భారత ఐటీ రాజధానిగా బెంగళూరు పేరు పొందింది. అక్కడ ట్రాఫిక్ కూడా ఎక్కువగానే ఉంటుంది. తాజాగా బెంగళూరు ట్రాఫిక్ గురించి గూగుల్ మ్యాప్స్ వెల్లడించిన అంశం ఆసక్తిని కలిగిస్తోంది. కిక్కిరిసిపోతున్న రోడ్లు, గంటల కొద్దీ ట్రాఫిక్ జామ్ లు బెంగళూరులో సాధారణంగా మారాయి. ఉద్యోగుల సమయం చాలావరకు ట్రాఫిక్ లోనే వృథా అవుతుండడంతో, ఉత్పాదకత తగ్గిపోతోందన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి.
దేశంలోని జన సమ్మర్ద నగరాల్లో బెంగళూరు ఒకటి. పైగా భారత ఐటీ రాజధానిగా బెంగళూరు పేరు పొందింది. అక్కడ ట్రాఫిక్ కూడా ఎక్కువగానే ఉంటుంది. తాజాగా బెంగళూరు ట్రాఫిక్ గురించి గూగుల్ మ్యాప్స్ వెల్లడించిన అంశం ఆసక్తిని కలిగిస్తోంది. కిక్కిరిసిపోతున్న రోడ్లు, గంటల కొద్దీ ట్రాఫిక్ జామ్ లు బెంగళూరులో సాధారణంగా మారాయి. ఉద్యోగుల సమయం చాలావరకు ట్రాఫిక్ లోనే వృథా అవుతుండడంతో, ఉత్పాదకత తగ్గిపోతోందన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. బెంగళూరు రోడ్లపై 6 కిలోమీటర్ల దూరం డ్రైవ్ చేసుకుంటూ వెళ్లడం కంటే, నడుస్తూ వెళ్లడం ద్వారా త్వరగా చేరుకోవచ్చట. బెంగళూరులో కేఆర్ పురం రైల్వే స్టేషన్ నుంచి గరుడాచార్ పాళ్యలోని బ్రిగేడ్ మెట్రోపొలిస్ వరకు ఏదైనా వాహనంలో వెళ్లడానికి 44 నిమిషాల సమయం పడితే, అదే దూరం నడిచి వెళ్లడానికి 42 నిమిషాలు పడుతుందని గూగుల్ మ్యాప్స్ చెబుతోంది. బెంగళూరు నగరం ఐటీ, ఐటీ అనుబంధ కంపెనీలతో ఆర్థికంగా ఎంతో ఎదిగినప్పటికీ, మౌలిక వసతుల పరంగా ఇంకా అభివృద్ధి చెందాల్సి ఉందన్న విషయాన్ని ఈ అంశం ఎత్తిచూపుతోంది. బెంగళూరు నగర జనాభా వేగంగా పెరగడంతో పాటు, ప్రణాళికబద్ధంగా నగర నిర్మాణం లేకపోవడం, పెరిగిన జనాభాను దృష్టిలో ఉంచుకుని చూస్తే పరిమిత స్థాయిలోనే రవాణా సౌకర్యాలు ఉండడం వంటి అంశాలు నగర ట్రాఫిక్ ను ప్రభావితం చేస్తున్నాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
9 టు 5 ఉద్యోగాలు ఇక ఉండవట !! మారనున్న ఉద్యోగాల తీరుతెన్నులు
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

