9 టు 5 ఉద్యోగాలు ఇక ఉండవట !! మారనున్న ఉద్యోగాల తీరుతెన్నులు
ప్రముఖ సోషల్‌మీడియా యాప్ లింక్డిన్ సహ వ్యవస్థాపకుడు రీడ్ హాఫ్‌మన్ భవిష్యత్తులో ఏ తరహా ఉద్యోగాలు ఉంటాయో చెప్పి సోషల్ మీడియాలో పెద్ద చర్చకే తెరతీశారు. హాఫ్‌మన్ గతంలో చేసిన పలు అంచనాలు నిజమయ్యాయి. సోషల్ మీడియాకు విపరీతమైన ఆదరణ రానుందని ఆయన ముందే పసిగట్టారు. అలాగే గిగ్ ఎకానమీ ఊపందుకుంటుందని, కృత్రిమ మేధ విప్లవం రానుందని 1997లోనే చెప్పారు.
ప్రముఖ సోషల్‌మీడియా యాప్ లింక్డిన్ సహ వ్యవస్థాపకుడు రీడ్ హాఫ్‌మన్ భవిష్యత్తులో ఏ తరహా ఉద్యోగాలు ఉంటాయో చెప్పి సోషల్ మీడియాలో పెద్ద చర్చకే తెరతీశారు. హాఫ్‌మన్ గతంలో చేసిన పలు అంచనాలు నిజమయ్యాయి. సోషల్ మీడియాకు విపరీతమైన ఆదరణ రానుందని ఆయన ముందే పసిగట్టారు. అలాగే గిగ్ ఎకానమీ ఊపందుకుంటుందని, కృత్రిమ మేధ విప్లవం రానుందని 1997లోనే చెప్పారు. తాజాగా.. ప్రస్తుతం ఉన్న 9 టు 5 ఉద్యోగాలు అంటే ఉదయం వచ్చి సాయంత్రం ఇంటికెళ్లే సంప్రదాయ ఉద్యోగాలు కనుమరుగవుతాయని అంచనా వేశారు. రాబోయే రోజుల్లో ఉద్యోగులు ఒకే దగ్గర, ఒకే డ్యూటీ చేయరని తెలిపారు. ఒకే సమయంలో వివిధ కంపెనీలకు రకరకాల పనులు చేసే రోజులు రానున్నాయని చెప్పారు. 2034 నాటికి ఇప్పుడున్న సంప్రదాయ ఉద్యోగాలు కనుమరుగవుతాయని హాఫ్‌మన్ తెలిపారు. దీని వల్ల అవకాశాలతో పాటు, సవాళ్లూ ఉంటాయని వివరించారు. స్థిరమైన ఉద్యోగాలు లేకపోవడం, నిపుణులు దీర్ఘకాలంలో ఒకేచోట పనిచేయడానికి ఇష్టపడకపోవడం వల్ల సమస్యలు తప్పవని తెలిపారు. అదే సమయంలో ఒకే వ్యక్తి వివిధ కంపెనీలకే కాకుండా తన నైపుణ్యాలు, ప్రతిభకు అనుగుణంగా పలు రంగాల్లో రకరకాల విధులు నిర్వర్తించే అవకాశం ఉంటుందని చెప్పారు. దీనివల్ల కంపెనీల ఉత్పాదకత పెరుగుతుందన్నారు. రాబోయే రోజుల్లో కృత్రిమ మేధ రెస్టారంట్లు వంటి ఆతిథ్య రంగం సహా అన్ని సెక్టార్లకు అనుసంధానమవుతుందని హాఫ్‌మన్ అంచనా వేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
క్యాండీ క్రష్లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

