Viral: ఒకే ట్రాక్‌పైకి నాలుగు రైళ్లు.! వైరల్ వీడియోపై క్లారిటీ ఇచ్చిన రైల్వే శాఖ.
రైల్వేకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఒడిశాలోని భువనేశ్వర్‌లో లింగరాజ్ స్టేషన్ వద్ద నాలుగు రైళ్లు ఒకే ట్రాక్‌పై ఉన్న వీడియో సోషల్ మీడియాలో తెగ సర్క్యులేట్ అవుతోంది. దీంతో కొందరు రైల్వేలోని భద్రతా లోపాలకు ఈ వీడియో అద్దంపడుతోందంటూ షేర్ చేయడం మొదలు పెట్టారు. వరుస రైలు ప్రమాద ఘటనల నేపథ్యంలో ఈ వీడియో బయటకు రావడం ఆందోళనకు కారణమైంది.
రైల్వేకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఒడిశాలోని భువనేశ్వర్‌లో లింగరాజ్ స్టేషన్ వద్ద నాలుగు రైళ్లు ఒకే ట్రాక్‌పై ఉన్న వీడియో సోషల్ మీడియాలో తెగ సర్క్యులేట్ అవుతోంది. దీంతో కొందరు రైల్వేలోని భద్రతా లోపాలకు ఈ వీడియో అద్దంపడుతోందంటూ షేర్ చేయడం మొదలు పెట్టారు. వరుస రైలు ప్రమాద ఘటనల నేపథ్యంలో ఈ వీడియో బయటకు రావడం ఆందోళనకు కారణమైంది. ఈ క్రమంలో వీడియోపై ఈస్ట్ కోస్ట్ రైల్వే స్పష్టతనిచ్చింది.
భువనేశ్వర్‌లోని లింగ్‌రాజ్ రోడ్డు పాసింజర్ హాల్ట్ వద్ద ఒకే లైన్‌లో నాలుగు రైళ్లు ఉన్న వీడియోను ఓ జాతీయ మీడియా ముందుగా ట్వీట్ చేసిందని ఈస్ట్‌కోస్ట్ రైల్వే తెలిపింది. ఈ క్రమంలో మిగిలిన మీడియా ఛానెళ్లూ దాన్ని అనుసరించాయని తీవ్రంగా స్పందించింది. సంబంధిత వీడియో ఆటో సెక్షన్‌లోనిదని, ఆ సెక్షన్‌లో ఒకే ట్రాక్‌పై అనేక రైళ్లు నిలవొచ్చని పేర్కొంది. ఇదేమీ భద్రతాపరమైన లోపం కాదని స్పష్టంచేసింది. సెక్షన్ కెపాసిటీ, భద్రతను పెంచడం ఈ సాంకేతికత ఉద్దేశమని తెలిపింది. రోజూ వందలాది రైళ్లు ఈ ఆటో సిగ్నలింగ్ సెక్షన్‌లోనే రాకపోకలు సాగిస్తుంటాయంటూ తెలిపింది. ఈ తరహా వార్తలు రైల్వే ప్రతిష్ఠను దెబ్బతీయడమే కాకుండా.. ప్రచురించే ముందు ధ్రువీకరించుకోవాలని మీడియాకు హితవు పలికింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.