Godavari: శాంతించు గోదారి.! గంటగంటకు పెరుగుతున్న గోదావరి వరద..
ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నదికి వరద ఉధృతి భారీగా పెరుగుతుంది. గంటగంటకు పెరుగుతున్న వరద కారణంగా.. భద్రాచలం వద్ద గోదావరి.. ప్రవాహం నీటి మట్టం 52 అడుగులకు చేరింది. దీంతో రెండో ప్రమాద హెచ్చరికలు కొనసాగిస్తున్నారు. దీంతో పాటుగా పోలవరం వద్ద 13.75 అడుగులకు గోదావరి నీటిమట్టం చేరింది. దీంతో ధవళేశ్వరం దగ్గర 2వ ప్రమాద హెచ్చరికలు జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నదికి వరద ఉధృతి భారీగా పెరుగుతుంది. గంటగంటకు పెరుగుతున్న వరద కారణంగా.. భద్రాచలం వద్ద గోదావరి.. ప్రవాహం నీటి మట్టం 52 అడుగులకు చేరింది. దీంతో రెండో ప్రమాద హెచ్చరికలు కొనసాగిస్తున్నారు. దీంతో పాటుగా పోలవరం వద్ద 13.75 అడుగులకు గోదావరి నీటిమట్టం చేరింది. దీంతో ధవళేశ్వరం దగ్గర 2వ ప్రమాద హెచ్చరికలు జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజీకి.. ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 12.52 లక్షల క్యూసెక్కులు గా ఉంది. పై నుంచి వచ్చిన నీటిని వచ్చినట్లే దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. సహాయక చర్యల్లో ఎస్డీఆర్‌ఎఫ్, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు పాల్గొనాలని.. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఆదేశాలు జారీ చేసింది. మరో వైపు తూర్పుగోదావరి జిల్లా బొబ్బిల్లంకలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఏటిగట్టు కోతకు గురవ్వడంతో భయాందోళనకు గురవుతున్నారు స్థానికులు. గట్టుకు గండి పడే ప్రమాదం ఉండటంతో అప్రమత్తమైన ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు… ఇసుక బస్తాలతో యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.