Viral Video: కటింగ్ షాప్‌లో ఎదురైన అనుభంతో 12 ఏళ్లు జుట్టు కత్తిరించుకోలేదు.. 3 గిన్నిస్ రికార్డులు సొంతం.. కానీ తాజాగా..
Viral Video: అందరు చేసే పనులు చేస్తే ప్రత్యేకత ఏముంటుంది చెప్పండి కాస్త భిన్నంగా ఆలోచిస్తేనే సమాజంలో గుర్తింపు లభిస్తుంది. అలాంటి వెరైటీ పనులు చేసే గిన్నిస్ బుక్‌లో స్థానం సంపాదించుకుంటుంటారు కొందరు...
Viral Video: అందరు చేసే పనులు చేస్తే ప్రత్యేకత ఏముంటుంది చెప్పండి కాస్త భిన్నంగా ఆలోచిస్తేనే సమాజంలో గుర్తింపు లభిస్తుంది. అలాంటి వెరైటీ పనులు చేసే గిన్నిస్ బుక్‌లో స్థానం సంపాదించుకుంటుంటారు కొందరు. అలాంటి కోవలోకే వస్తుంది గుజరాత్‌కు చెందిన నిలాన్షి పటేల్. ఈ 18 ఏళ్ల అమ్మాయి గత 12 ఏళ్లుగా జట్టు కత్తిరించుకోకపోవడం విశేషం. దీంతో నిలాన్షి అత్యంత పొడవైన జుట్టుకలిగిన టీనేజర్‌గా గిన్నిస్‌బుక్‌లో స్థానం సంపాదించుకుంది. దాదాపు 6.7 ఫీట్ల పొడవైన జుట్టుతో నిలాన్షి ఈ రికార్డును 2020లో సొంతం చేసుకుంది. ఇక అంతకుముందు కూడా ఇదే కేటగిరిలో 2018, 2019లో గిన్నిస్ బుక్‌లోకి ఎక్కింది.
నిలాన్షి ఆరేళ్ల వయసు నుంచి జుట్టు కత్తిరించుకోవడం ఆపేసింది. అయితే దీనికి ఓ విభిన్న కారణం ఉంది అదేంటంటే.. ఓసారి నిలాన్షి కటింగ్ చేసుకోవడానికి సెలూన్‌కు వెళ్లింది. కానీ ఆ రోజు ఆమెకు కటింగ్ సరిగా చేయలేదు. దీంతో అసహనానికి గురైన నిలాన్షి ఆరోజు నుంచి కటింగ్ చేసుకోకూడదని నిర్ణయించుకుంది. అయితే తాజాగా తన పొడవాటి జడను కత్తిరించుకోవాలని డిసైడ్ అయిన నిలాన్షి ఆ పని చేసింది. ఈ క్రమంలోనే తాను జుట్టు పెంచుకోవడానికి కారణాలు, జుట్టు కత్తిరించుకుంటున్న సమయంలో ఓ వీడియోను చిత్రీకరించారు. ఈ వీడియోను గిన్నిస్ బుక్ యాజమాన్యం యూట్యూబ్‌లో పోస్ట్ చేసింది. దీంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నిలాన్షి కత్తిరించుకున్న తన జుట్టును మ్యూజియంకు డొనేట్ చేసింది. దీంతో నిలాన్షి ఇతరులకు ఆదర్శంగా నిలుస్తుందని ఆమె తల్లి చెబుతోంది. ఇక నిలాన్షితో పాటు ఆమె తల్లి కూడా..తన జుట్టును క్యాన్సర్ బాధితుల కోసం ఇవ్వడం మరో విశేషం.
Also Read: రూ.80 నుంచి రూ.16,000 కోట్లకు చేరిన లిజ్జత్ పాపడ్.. వారి సక్సెస్‌కు కారణం ఇదే..
పెద్దమనసు చాటుకున్న ముఖేష్ అంబానీ..! కరోనా పేషెంట్ల కోసం ఉచితంగా ఆక్సిజన్ సిలిండర్ల సరఫరా..