Viral video : గోమాత విశ్వాసం అంటే ఇదేమరీ..! యజమానిపై దాడి చేసిన వ్యక్తిని వెంటాడి దూకింది..!!

కుక్కలు విశ్వాసానికి ప్రతీక..అవి తనను పెంచుకునే యజమానికి కాపలాగా ఉంటూ చివరి వరకూ తన విశ్వాసాన్ని ప్రదర్శిస్తుంది. కుక్క చూపించే విశ్వాసంపై సోషల్‌ మీడియాలో చాలా వీడియోలు, వార్తలు వైరల్‌ అవుతుంటాయి. అయితే, కుక్కలు మాత్రమే కాదు, ..

Viral video : గోమాత విశ్వాసం అంటే ఇదేమరీ..! యజమానిపై దాడి చేసిన వ్యక్తిని వెంటాడి దూకింది..!!
Cow Saves Owner
Follow us
Jyothi Gadda

|

Updated on: May 16, 2022 | 7:23 PM

కుక్కలు విశ్వాసానికి ప్రతీక..అవి తనను పెంచుకునే యజమానికి కాపలాగా ఉంటూ చివరి వరకూ తన విశ్వాసాన్ని ప్రదర్శిస్తుంది. కుక్క చూపించే విశ్వాసంపై సోషల్‌ మీడియాలో చాలా వీడియోలు, వార్తలు వైరల్‌ అవుతుంటాయి. అయితే, కుక్కలు మాత్రమే కాదు, పెంపుడు పశువులు కూడా తమ యజమానుల పట్ల విశ్వాసాన్ని ప్రదర్శిస్తాయి..అందుకు నిదర్శనంగా నిలుస్తున్న ఓ వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. ఈ వీడియోను గుజరాత్‌కు చెందిన జన్మద్ మథ్దా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. వీడియోకు నెటిజన్లు కామెంట్లతో ప్రశంసలు కురిపిస్తున్నారు. వీడియో ప్రకారం..

ఓ వ్యక్తి పొలంలో పశువులను మేపుతున్నాడు. అదేసమయంలో వెనక నుంచి వచ్చిన మరో వ్యక్తి పశువులు కాస్తున్న యువకుడిపై దాడి చేస్తున్నట్టుగా ప్రవర్తించాడు. అతడు తన యాజమాని పై దాడి చేస్తున్న ఘటనను దూరం నుంచి చూసింది మందలోని ఓ ఆవు. అంతే…తన యజమానికి ప్రాణాపాయం వచ్చిందని భావించి పరిగెత్తుకు వచ్చింది. ఇక ఆ ఆవుని చూసి భయపడిన వ్యక్తి వెంటనే పరుగులంకించాడు. వెంటనే అప్రమత్తమైన యజమాని ఆవుని దగ్గరకి తీసుకున్నాడు. ఏదో నచ్చజెప్పినట్టుగా చేశాడు. దాంతో ఆ ఆవు శాంతించింది. కాగా దీనికి సంబందించిన వీడియో సోషల్‌ మీడియాలో తెగ ట్రెండ్‌ అవుతోంది. అయితే, వీడియోలు పశువుల యజమానిపై దాడి చేసిన వ్యక్తి ఏదో సరదాగానే చేసినట్టుగా కనిపించింది. కానీ, మనుషులు చేసే ఫ్రాంక్‌ తెలియని మూగజీవి తన యజమానికి ఆపద వచ్చిందనుకుని అల్లాడిపోయింది. కాపాడేందుకు పరిగెత్తుకుంటూ వచ్చింది. దీన్ని బట్టి చూస్తే మనుషులపై మూగజీవాలు చూపించే విశ్వాసం ఎంతో గొప్పదంటూ నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి