Water RS 1.30: బిందె నీళ్లు రూ.1.30 లక్షలు.. ఈ నీటితో స్నానం చేస్తే సంతానప్రాప్తి..! ఎక్కడో తెలుసా..?
హిందూ ఆలయాల్లో నీటి గుండాలు కనిపిస్తాయి. భక్తులు ఆ గుండాల్లో పుణ్యస్నానాలు ఆచరించి దేవుడిని దర్శించుకుంటారు. కొందరైతే గుండంలోని నీటిని బాటిళ్లలో నింపుకొని ఇళ్లకు తీసుకెళ్తారు.
హిందూ ఆలయాల్లో నీటి గుండాలు కనిపిస్తాయి. భక్తులు ఆ గుండాల్లో పుణ్యస్నానాలు ఆచరించి దేవుడిని దర్శించుకుంటారు. కొందరైతే గుండంలోని నీటిని బాటిళ్లలో నింపుకొని ఇళ్లకు తీసుకెళ్తారు. దానికి ఎవరూ అభ్యంతరం చెప్పరు. ఉచితంగానే ఇస్తారు. కానీ ఆలయ గుండంలోని లక్షల రూపాయలకు విక్రయించడం ఎక్కడైనా చూశారా..! ఒడిశాలోని ముక్తేశ్వర పుణ్యక్షేత్రంలో ఒక బిందె నీరు 1.30 వేల రూపాయలు పలికింది. ఆ నీటిని తీసుకునేందుకు భక్తులు పోటీపడ్డారు. ఎందుకంటే..ఒడిశా భువనేశ్వర్‌లోని ముక్తేశ్వర ఆలయ ప్రాంగణంలో ఉన్న మరీచి గుండం ఎంతో ప్రసిద్ధి చెందినది. ఈ గుండంలో నీటితో స్నానం చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని, అనారోగ్య సమస్యలు తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు. ఈ గుండం చుట్టుపక్కల ఉన్న అశోక చెట్ల వేర్ల ప్రభావంతో ఆ నీటిలో ఔషధ గుణాలుంటాయని స్థానికులు చెబుతారు. ఈ కారణంగా ప్రతి ఏటా మరీచి గుండంలోని నీటిని.. లింగరాజస్వామి రుకుణ (రథ) యాత్రలో భాగంగా ఏటా అశోక అష్టమి ముందు రోజు రాత్రి వేలంలో విక్రయిస్తారు. లింగరాజ ఆలయంలో ఉండే బడునియోగ్ వర్గానికి చెందిన సేవాయత్‌లు ఈ ప్రక్రియ చేపడతారు. శుక్రవారం రాత్రి జరిగిన ఈ వేలంపాటలో తొలి బిందె నీటి ధర 25 వేలతో ప్రారంభమైంది. ఆ బిందెను భువనేశ్వర్‌లోని బారాముండా ప్రాంతానికి చెందిన దంపతులు లక్షా 30 వేలకు కొనుక్కున్నారు. రెండో బిందెను 47 వేలు, మూడో బిందె నీటిని 13 వేల రూపాయలకు భక్తులు దక్కించుకున్నారు. మిగిలిన నీటిని పేద దంపతులకు ఉచితంగా పంపిణీ చేశారు.
మరిన్ని చూడండి ఇక్కడ:
Elephant-Lion: అః.. కుక్క మొరిగితే కొండకు సేట.. ఏనుగుపై సింహం దాడి.. కట్‌చేస్తే.. సీన్ రివర్స్
Viral Video: అవ్వ..! పెళ్లిలో వరుడి స్నేహితుడి నిర్వాకం.. ఏం చేస్తున్నాడో మీరే చూడండి..
Viral Video: వారేవా ఇది కదరా స్నేహమంటే.. దివ్యాంగుడిని భుజాలపై తిప్పిన గర్ల్స్.. వైరల్ వీడియో
Ram Charan-Urfi Javed: రామ్ చరణ్ కు పడిపోయిన.. బాలీవుడ్ శృంగార తార.. ఓపెన్ ఆఫర్ అంటూ ఇలా..
Viral Video: మరికొద్ది క్షణాల్లో పెళ్లి.. మండపంలోకి మాజీ ప్రియుడి ఎంట్రీతో సీన్ రివర్స్..
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం
మంటలతో పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన వ్యాను
క్రిస్మస్ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత
విద్యుత్ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు

