విద్యార్ధులతో టీచర్ అశ్లీల నృత్యం .. మండి పడుతున్న నెటిజన్లు
విద్యార్ధులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన టీచర్ వారితో అసభ్యంగా ప్రవర్తించింది. పైగా విద్యార్ధులకు ఇంట్రెస్టింగ్‌గా పాఠాలు చెప్పడమే తన ఉద్దేశమంటోంది. ఈ టీచర్ తీరుపై పలువురు మండి పడ్డారు. ఇంకొందరు ఆ టీచర్‌కి మద్దతుగా నిలిచారు. ఏది ఏమైనా ఆమె ప్రవర్తించిన తీరుపే విమర్శలు వెల్లువెత్తాయి.
విద్యార్ధులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన టీచర్ వారితో అసభ్యంగా ప్రవర్తించింది. పైగా విద్యార్ధులకు ఇంట్రెస్టింగ్‌గా పాఠాలు చెప్పడమే తన ఉద్దేశమంటోంది. ఈ టీచర్ తీరుపై పలువురు మండి పడ్డారు. ఇంకొందరు ఆ టీచర్‌కి మద్దతుగా నిలిచారు. ఏది ఏమైనా ఆమె ప్రవర్తించిన తీరుపే విమర్శలు వెల్లువెత్తాయి. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. బ్రెజిల్‌లో ఓ టీచర్ క్లాస్ రూమ్‌లో పాఠాలు చెబుతూ విద్యార్థులతో అసభ్యకరంగా డ్యాన్స్ చేస్తూ ఆ వీడియోను టిక్‌టాక్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసి నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యారు. సిబెల్లీ ఫెరీరా అనే టీచర్ ఉద్దేశం మంచిదే అయినా విద్యార్థులతో ఆమె చేసిన డ్యాన్స్ వీడియోలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆమెను ఉద్యోగం నుంచి తొలగించినట్టు స్థానిక మీడియా పేర్కొంది. సిబెల్లీ ఫెరీరా బ్రెజిల్‌లోని ఓ స్కూల్‌లో ఇంగ్లిష్ టీచర్‌గా పనిచేస్తున్నారు. సోషల్ మీడియాలో ఆమెకు మంచి పాపులారిటీ ఉంది. క్లాస్ రూమ్‌లో విద్యార్థులకు పాఠాలపై ఆసక్తి కలిగించేందుకు తనదైన శైలిలో ‘అశ్లీల డ్యాన్స్ చేస్తూ పాఠాలు చెబుతోంది. అంతేకాదు ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ‘సోషల్ నెట్‌వర్క్‌లు, టెక్నాలజీకి అలవాటు పడిన విద్యార్ధులు వాటిని కాదని, క్లాస్ రూమ్‌లో స్టడీస్‌పై దృష్టి కేంద్రీకరించడం ఎంత కష్టమో నాకు తెలుసు. అందుకే వారికి నచ్చిన దారిలోనే పాఠాలు చెప్పాలని వారి ఆసక్తిని అనుకూలంగా మలుచుకొని పాఠాలు చెబుతున్నానని ఫెరీరా తన తీరును సమర్ధించుకుంటూ స్థానిక మీడియాతో అన్నారు. అయినా ఆమె తీరు పట్ల పలువురు నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. మరోవైపు, ఫెరీరా అభిమానులతో పాటు మరికొందరు నెటిజన్లు మాత్రం ఆమె చర్యలను సమర్థిస్తున్నారు. విద్యను మరింత వినోదభరితంగా అందిస్తున్నారంటూ మద్దతుగా నిలుస్తున్నారు. తరగతి గదిలో విద్యార్థులకు బోధనపై ఆసక్తిని పెంచేందుకు సరదాగా నృత్యం చేస్తూ ప్రపంచాన్ని ప్రేమలో పడేలా చేసిన సిబెల్లీని ఉద్యోగం నుంచి తొలగించడం దురదృష్టకరమంటూ ఇంకొందరు ట్వీట్లు పెడుతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మీ వాట్సాప్ చాటింగ్ ఎవరికీ కనిపించకూడదంటే ఇలా చేయండి
స్నేహమంటే ఇదేరా.. నెట్టింట వైరల్ అవుతున్న క్యూట్ వీడియో
పాత పైపుల్లోంచి వింత శబ్ధం !! ఏంటా అని చూస్తే ఒక్కసారిగా
నీటిలో చకచకా ఈదుతున్న తల లేని చేప.. ఇలా ఎలా అని షాక్ అవుతున్న నెటిజన్స్
వార్నీ.. ఇదేం బౌలింగ్‌రా సామీ.. చూస్తే నవ్వాపుకోలేరు