Black Snow Video: ఈ దేశంలో మంచు నల్లగా కురుస్తోంది.. ప్రకృతి విరుద్ధంగా ఇదేం అప్రాచ్యం?

చల్లని శీతల గాలులు, తెల్లని మంచు తుంపరలు హేమంత ఋతువు (Winter Season)లో చలి కొంత కష్టాన్ని కలిగించినా, ఇష్టమైన కష్టంగా బలే ఉంటుంది కదా! నిజానికి.. అదో రకమైన థ్రిల్ ఇస్తుంది. ఐతే ఒక్క సారి ఊహించండి.. మంచు తెల్లగా కాకుండా పూర్తి నల్లగా ఉంటే..

Black Snow Video: ఈ దేశంలో మంచు నల్లగా కురుస్తోంది.. ప్రకృతి విరుద్ధంగా ఇదేం అప్రాచ్యం?
Black Snow
Follow us
Srilakshmi C

|

Updated on: Jan 29, 2022 | 7:30 PM

Black snow covers streets of Omsukchan village Know Shocking Reasons: చల్లని శీతల గాలులు, తెల్లని మంచు తుంపరలు హేమంత ఋతువు (Winter Season)లో చలి కొంత కష్టాన్ని కలిగించినా, ఇష్టమైన కష్టంగా బలే ఉంటుంది కదా! నిజానికి.. అదో రకమైన థ్రిల్ ఇస్తుంది. ఐతే ఒక్క సారి ఊహించండి.. మంచు తెల్లగా కాకుండా పూర్తి నల్లగా ఉంటే.. ఉదయం నిద్రలేచేసరికి ఊరంతా నల్లగా మంచు (Black snow) పేరుకుపోయి ఉంటే.. మీకేమనిపిస్తుంది? చిర్రెత్తుకొస్తుందని తెలుసులే..! ఊహకే కంపరం పుడుతోంది.. అటువంటిది పాపం.. ఈ దేశంలో నల్లని మంచు రోజూ కొన్ని అడుగుల మందంతో కురుస్తోంది మరి. కారణం తెలియక జుట్టు పీక్కున్నంత పనిచేస్తున్నారు. ఆ విశేషాలు ఏమిటో తెలుసుకుందామా..

ఈ వింత సంఘటన రష్యాలో చోటుచేసుకుంది. నిజానికి అక్కడ ఓ మారుమూల ప్రాంతంలో కాలుష్యం కారణంగా నల్లని మంచు కురుస్తోందట. అందువల్లనే తెల్లటి మంచు పడటానికి బదులుగా, నల్లని మంచు పడుతోంది. ఈ దేశానికి చెందిన సైబీరియాలోని మగడాన్ ప్రాంతంలోని ఓంసుచన్‌లో నల్లని మంచు కురుస్తోంది. బూడిద, నల్లటి మంచుతో కప్పబడిన వీధుల్లోతమ పిల్లలు ఆటలాడుకోవల్సి వస్తుందని అక్కడి స్థానికులు వాపోతున్నారు. నిజానికి.. బొగ్గుతో పనిచేసే వేడి నీటి ప్లాంట్ (coal-fired hot water plant) ఈ ప్రాంతంలో ఉంది. ఈ ప్లాంట్ ఆ ప్రాంతంలోని నాలుగు వేల మందికి అవసరమైన వేడిని అందిస్తుంది. దీంతో మసి, దుమ్ము వల్ల కాలుష్యం కూడా బాగా పెరిగింది. ప్రస్తుతం ఇక్కడ కురుస్తున్న నల్లని మంచుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. 21వ శతాబ్దంలో మనం ఏ విధంగా జీవిస్తున్నామనేది దీనిని బట్టి తెలుస్తోందని, 2019లో కూడా ఈ విధంగానే నల్లని మంచు కురిసిందని అక్కడి స్థానికులు తెలిపారు. మరోవైపు మూడు దశాబ్ధాల క్రితం సోవియట్ యూనియన్ కుప్పకూలినప్పటినుంచి ఇక్కడి పరిస్థితిలో ఎటువంటి మార్పు జరగలేదని, ఇప్పటికీ మా పిల్లలు నల్లని పొగను పీల్చుతున్నారని, ఇక్కడి పరిస్థితులు ఏమీ మారలేదని కూడా స్థానికులకు అంటున్నారు.

ఈ నెల (జనవరి)లో రష్యా ఉష్ణోగ్రతలు 50 డిగ్రీల కంటే తక్కువకు చేరుకుందని, అందువల్ల బొగ్గును పెద్ద ఎత్తున కాల్చారని, అందుకే నల్లని మంచు కురుస్తోందని అధికారులు అంటున్నారు.  నిజంగా బొగ్గును కాల్చడం వల్ల జరిగిందో.. మరెందుకు నల్లని మంచుకురుస్తుందో ఖచ్చితమైన కారణాలు మాత్రం తెలియరాలేదు.

Also Read:

IIT Kharagpur Jobs: బీటెక్‌/ఎంటెక్‌ అర్హతతో ఐఐటీ ఖరగ్‌పూర్‌లో వివిధ ఉద్యోగావకాశాలు.. పూర్తి వివరాలివే!

జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.