Nature Power: భూకంపాన్ని ముందే పసిగట్టిన పక్షులు.? కొద్ది క్షణాల ముందు అసాధారణ ప్రవర్తన.

Nature Power: భూకంపాన్ని ముందే పసిగట్టిన పక్షులు.? కొద్ది క్షణాల ముందు అసాధారణ ప్రవర్తన.

Anil kumar poka

|

Updated on: Jan 03, 2024 | 5:51 PM

మనుషులకు మించి ప్రకృతిని అర్ధం చేసుకునే శక్తి పక్షులకి ఉందా అంటే.. అవుననే సమాధానమే వస్తుంది. ప్రకృతి వైపరీత్యాలను కాకులు , కుక్కలు ఇతర జంతువులు మొదలైనవి ముందుగానే గుర్తిస్తుంటాయి. సునామీ, భూకంపం లాంటి ప్రకృతి విపత్తులు సంభవించడానికి కొన్ని క్షణాల ముందు వేలాది కాకులు వింతగా ప్రవర్తించడానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

మనుషులకు మించి ప్రకృతిని అర్ధం చేసుకునే శక్తి పక్షులకి ఉందా అంటే.. అవుననే సమాధానమే వస్తుంది. ప్రకృతి వైపరీత్యాలను కాకులు , కుక్కలు ఇతర జంతువులు మొదలైనవి ముందుగానే గుర్తిస్తుంటాయి. సునామీ, భూకంపం లాంటి ప్రకృతి విపత్తులు సంభవించడానికి కొన్ని క్షణాల ముందు వేలాది కాకులు వింతగా ప్రవర్తించడానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా ద్వీప దేశమైన జపాన్‌లో 2024 నూతన సంవత్సరం తొలిరోజే శక్తివంతమైన భూకంపం చోటు చేసుకుంది. వాయవ్య జపాన్‌ తీరంలో సోమవారం సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో పలుమార్లు భూప్రకంపనలు నమోదయ్యాయి. కనీసం 21 సార్లు భూమి కంపించినట్లు స్థానిక మీడియా పేర్కొంది. అయితే ఈ భూకంపానికి కొన్ని నిముషాల ముందు వేలాది పక్షలు ఒకచోట చేరి విచిత్రంగా ప్రవర్తించాయి. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

జపాన్‌లోని క్యోటో నగరంలో మాదిరిగానే కొన్నాళ్ల క్రితం క్రితం టర్కీలో సంభవించిన విధ్వంసకర భూకంపానికి కొద్ది క్షణాల ముందు కూడా పక్షులు అసాధారణంగా ప్రవర్తించాయి. భారీ సంఖ్యలో పక్షులు గుమిగూడి కిలకిలారావాలు చేస్తూ ఆకాశంలో అటుఇటూ సంచరిస్తూ కనిపించాయి. పక్షులు అలా ప్రవర్తించడానికి కారణం రానున్న భూకంపాన్ని పసిగట్టడమేనంటూ నిపుణులు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.