టికెట్‌ అడిగిన ప్యాసింజర్‌.. చెంప పగలగొట్టిన కండక్టర్‌

బస్సు ఎక్కగానే ప్రయాణికులు టికెట్‌ తీసుకోవడం సహజం. ఒక వేళ టికెట్‌ లేకుండా ప్రయాణిస్తే భారీ మొత్తంలో ఫైన్‌ చెల్లించాల్సి ఉంటుంది. కండక్టర్‌ కూడా ప్రతి ఒక్కరూ టికెట్‌ తీసుకునేలా బాధ్యతా వ్యవహరించాలి. కానీ ఓ కండక్టర్‌ అందుకు విరుద్ధంగా ప్రవర్తించడమే కాకుండా టికెట్‌ అడిగిన ప్రయాణికులపై దాడికిపాల్పడ్డాడు. ఈ ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. vమార్చి 26 ఉదయం 10 గంటల సమయంలో బస్సులో ప్రయాణిస్తున్న ఓ మహిళా ప్రయాణికురాలు కండక్టర్‌ను టికెట్‌ ఇవ్వాలని కోరింది.

టికెట్‌ అడిగిన ప్యాసింజర్‌.. చెంప పగలగొట్టిన కండక్టర్‌

|

Updated on: Mar 29, 2024 | 1:27 PM

బస్సు ఎక్కగానే ప్రయాణికులు టికెట్‌ తీసుకోవడం సహజం. ఒక వేళ టికెట్‌ లేకుండా ప్రయాణిస్తే భారీ మొత్తంలో ఫైన్‌ చెల్లించాల్సి ఉంటుంది. కండక్టర్‌ కూడా ప్రతి ఒక్కరూ టికెట్‌ తీసుకునేలా బాధ్యతా వ్యవహరించాలి. కానీ ఓ కండక్టర్‌ అందుకు విరుద్ధంగా ప్రవర్తించడమే కాకుండా టికెట్‌ అడిగిన ప్రయాణికులపై దాడికిపాల్పడ్డాడు. ఈ ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. vమార్చి 26 ఉదయం 10 గంటల సమయంలో బస్సులో ప్రయాణిస్తున్న ఓ మహిళా ప్రయాణికురాలు కండక్టర్‌ను టికెట్‌ ఇవ్వాలని కోరింది. అయినా అతను టికెట్‌ ఇవ్వకపోవడంతో పదే పదే అడిగి విసిగిపోయిన ఆమె కండక్టర్‌తో వాగ్వాదానికి దిగింది. ఈ క్రమంలో మహిళ కండక్టర్‌ చెంపపై కొట్టింది. దీంతో రెచ్చిపోయిన కండక్టర్‌ ఒక్కసారిగా మహిళపై దూకి దాడికి పాల్పడ్డాడు. తోటి ప్రయాణికులు వారిస్తున్నా వినిపించుకోకుండా కండక్టర్‌ మహిళపై దాడి చేశాడు. దాడి అనంతరం బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. టికెట్ ఇవ్వాలని పలుమార్లు కోరినా అతడు టికెట్ ఇచ్చేందుకు నిరాకరించాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బుడి బుడి అడుగుల చిన్నారి.. ఎవరెస్ట్‌నే ఎక్కేసిందిగా

టీచర్‌ను చెప్పులతో తరిమి కొట్టిన విద్యార్ధులు..ఎందుకో తెలుసా ??

మండుతున్న ఎండలు.. తెలంగాణలో ఆరెంజ్‌ అలర్ట్‌ !!

లండన్‌లో ఇల్లు కొన్న ప్రభాస్‌.. నెట్టింట వైరల్‌ అవుతున్న లేటెస్ట్‌ న్యూస్‌

Follow us