మండుతున్న ఎండలు.. తెలంగాణలో ఆరెంజ్‌ అలర్ట్‌ !!

మండుతున్న ఎండలు.. తెలంగాణలో ఆరెంజ్‌ అలర్ట్‌ !!

Phani CH

|

Updated on: Mar 29, 2024 | 1:21 PM

తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి. వచ్చే మూడు రోజులు భానుడి భగభగలు మరింత పెరుగనున్నట్లు కేంద్ర వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మార్చి 27 నుంచి 29 వరకు వరుసగా మూడు రోజుల పాటు ఎండలు తీవ్రంగా ఉండనున్నట్లు వాతావరణ కేంద్రం పేర్కొంది. దీంతో రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది. ఈ జిల్లాల్లో విపరీతమైన ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని, ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు పెరగవచ్చని తెల్పింది.

తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి. వచ్చే మూడు రోజులు భానుడి భగభగలు మరింత పెరుగనున్నట్లు కేంద్ర వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మార్చి 27 నుంచి 29 వరకు వరుసగా మూడు రోజుల పాటు ఎండలు తీవ్రంగా ఉండనున్నట్లు వాతావరణ కేంద్రం పేర్కొంది. దీంతో రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది. ఈ జిల్లాల్లో విపరీతమైన ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని, ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు పెరగవచ్చని తెల్పింది. ముఖ్యంగా ఆదిలాబా ద్‌, నిర్మల్‌, కరీంనగర్‌, మంచిర్యాల, ఆసిఫాబాద్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లిలకు బుధవారం ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది. మార్చి 28న అధిక ఉష్ణోగ్రతలతోపాటు వేడిగాలులు కొనసాగుతాయని వెల్లడించింది. భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, ములుగు, వరంగల్‌, హనుమకొండ, మహబూబ్‌నగర్‌, సూర్యాపేట, నారాయణపేట, నల్లగొండ, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని పేర్కొంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

లండన్‌లో ఇల్లు కొన్న ప్రభాస్‌.. నెట్టింట వైరల్‌ అవుతున్న లేటెస్ట్‌ న్యూస్‌