Ram Lalla: బాలుడిని అయోధ్య బాలరాముడిలా మార్చేసిన దంపతులు.! ఎందుకంటే.?

అయోధ్య రామయ్యపై ఉన్న భక్తితో ఆర్టిస్టులైన దంపతులు 9 ఏళ్ల బాలుడిని అచ్చం రామ్ లల్లా గా మార్చేశారు. పొరపాటున కాదు.. ఎలా చూసినా ఆ బాలుడు అచ్చం అయోధ్య రామయ్యలానే కనిపిస్తుండడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఆ దంపతుల కృషికి ప్రశంసలు కురిపిస్తున్నారు. పశ్చిమ బెంగాల్‌లోని అసన్‌సోల్‌కు చెందిన ఆశిష్‌కుందు తన భార్య రూబీ సహకారంతో ఓ బాలుడిని బాల రామయ్యలా మార్చేశాడు.

Ram Lalla: బాలుడిని అయోధ్య బాలరాముడిలా మార్చేసిన దంపతులు.! ఎందుకంటే.?

|

Updated on: Mar 21, 2024 | 10:11 AM

అయోధ్య రామయ్యపై ఉన్న భక్తితో ఆర్టిస్టులైన దంపతులు 9 ఏళ్ల బాలుడిని అచ్చం రామ్ లల్లా గా మార్చేశారు. పొరపాటున కాదు.. ఎలా చూసినా ఆ బాలుడు అచ్చం అయోధ్య రామయ్యలానే కనిపిస్తుండడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఆ దంపతుల కృషికి ప్రశంసలు కురిపిస్తున్నారు. పశ్చిమ బెంగాల్‌లోని అసన్‌సోల్‌కు చెందిన ఆశిష్‌కుందు తన భార్య రూబీ సహకారంతో ఓ బాలుడిని బాల రామయ్యలా మార్చేశాడు. ఇంట్లో తయారుచేసిన, మార్కెట్లో దొరికిన మేకప్ వస్తువులతోనే ఆశిష్ తన నైపుణ్యాన్ని ప్రదర్శించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. కేవలం నెలరోజుల్లోపే ఈ అసాధారణ ఘనత సాధించారు. అసన్‌సోల్‌లోని మోహిసెలా ప్రాంతానికి చెందిన అబీర్ దే అనే బాలుడు వారి చేతిలో బాల రామయ్యగా ఒదిగిపోయాడు. అయోధ్య బాలరామయ్య రూపురేఖలతో అచ్చం అలాగే దర్శనమిచ్చాడు. జనవరి 22న రామాలయ ప్రతిష్ఠాపన జరిగినప్పటి నుంచి రామ్ లల్లాను పోలిన విగ్రహాన్ని రూపొందించాలన్న కోరిక తనలో కలిగిందని ఆశిశ్‌ తెలిపారు. అయితే, ఆయన కోరిక నెరవేరకపోగా, అది మరోలా తీరింది. విగ్రహం కాకుండా ఏకంగా బాలుడినే రాముడిలా తీర్చిదిద్దాలని నిర్ణయించుకున్నారు. ఆశిష్ ఒకరోజు అనుకోకుండా 9 ఏళ్ల అబీర్‌ బీని చూశాడు. వెంటనే అబీర్ బీ కుటుంబాన్ని కలిసి తన కోరికను వారికి వివరించాడు.

అందుకు వాళ్లుకూడా ఒప్పుకున్నారు. వెంటనే తన పనులు ప్రారంభించారు ఆశిష్‌ దంపతులు. పగటిపూట బ్యూటీ పార్లర్ నిర్వహించే ఈ ఆర్టిస్ట్ దంపతులు రాత్రివేళ మాత్రం బాలుడిని రాముడిగా మార్చడంపై వ్యూహాలు సిద్ధం చేశారు. కచ్చితమైన ప్రణాళిక, కృషితో నెలరోజుల్లోనే ఆశిష్-రూబీ దంపతులు లక్ష్యాన్ని చేరుకున్నారు. బాలుడిని రాముడిలా మార్చేందుకు అవసరమైన మేకప్ వస్తువులను సమకూర్చుకోవడంతోపాటు ఆభరణాలను రూపొందించారు. ఆభరణాల బరువుతో బాలుడు ఇబ్బంది పడకుండా ఉండేందుకు తేలికైన ఫోమ్‌తో ఆభరణాలు రూపొందించారు. అబీర్ బీని బాలరాముడిలా రెడీ చేశాక, అతడిని చూసి జనం తమను తాము నమ్మలేకపోయారు. ఫొటోలు, వీడియోలు తీసుకుని మురిసిపోయారు. ఇవి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆశిష్-రూబీ దంపతులు ఫేమస్ అయిపోయారు. ఇక బాలుడు అచ్చం అయోధ్య బాలరామయ్యలానే ఉన్నాడని ప్రశలు కురిపిస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.

ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.

‘నా భర్త VDలా ఉండాలి.!’ నో కన్ఫూజన్‌ తెలిసిన కాంబినేషనేగా..

Follow us