Elephant Viral video: అవును..! అమ్మ ప్రేమ ఇలానే ఉంటుంది.. మనుషులే కాదు ముగజీవులకు కూడా..

Elephant Viral video: అవును..! అమ్మ ప్రేమ ఇలానే ఉంటుంది.. మనుషులే కాదు ముగజీవులకు కూడా..

Anil kumar poka

|

Updated on: Apr 27, 2022 | 8:52 AM

సృష్టిలో తల్లిని మించిన దైవం లేదు అంటారు. అందుకే తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నారు. దైవం కంటే కూడా మొట్టమొదటి పూజ్యనీయ స్థానం తల్లికే ఇచ్చారు. తల్లి ప్రేమ, ఆదరణ అంత గొప్పవి. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ భూమి మీద కదిలే దైవం తల్లి. కేవలం మనుషుల్లోనే కాదు..


సృష్టిలో తల్లిని మించిన దైవం లేదు అంటారు. అందుకే తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నారు. దైవం కంటే కూడా మొట్టమొదటి పూజ్యనీయ స్థానం తల్లికే ఇచ్చారు. తల్లి ప్రేమ, ఆదరణ అంత గొప్పవి. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ భూమి మీద కదిలే దైవం తల్లి. కేవలం మనుషుల్లోనే కాదు..పశుపక్ష్యాదులలో కూడా తల్లి ప్రేమలో తేడా ఉండదు. తాజాగా ఓ ఏనుగుకి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో హల్‌చల్‌ చేస్తుంది. ఇందులో తల్లి ఏనుగు కనబరిచిన తెగువకి అందరు ఫిదా అవుతున్నారు. వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఓ ఏనుగుల గుంపు నది దాటుతోంది. అందులో ఓ పిల్ల ఏనుగు నదీ ప్రవాహంలో కొట్టుకు పోతుంది. అది గమనించిన తల్లి ఏనుగు తల్లడిల్లిపోయింది. తన బిడ్డను ఎలాగైనా కాపాడుకోవాలనుకుంది. అప్పటికే చాలాదూరం కొట్టుకుపోతున్న పిల్ల ఏనుగును రక్షించుకునే ప్రయత్నం చేస్తుంది. అయితే కొన్ని ఏనుగులు అప్పటికే ఒడ్డుకు చేరుకున్నాయి. కొట్టుకుపోతున్న పిల్ల ఏనుగుని చూసి సహాయం చేయడానికి అవి కూడా ముందుకు వస్తాయి. చివరికి తల్లి ఏనుగు నదీ ప్రవాహానికి ఎదురు నిలిచి తన తొండంతో పిల్ల ఏనుగుని అదిమి పట్టుకుని, నెమ్మదిగా ఒడ్డుకి చేర్చుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు తల్లి ఏనుగు సాహసానికి ఫిదా అవుతున్నారు.ఈ హార్ట్‌ టచ్చింగ్‌ వీడియోను ఒక నెటిజన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ఈ వీడియోని లక్షలమంది వీక్షిస్తూ లైక్స్‌, కామెంట్స్‌ చేస్తున్నారు. తల్లి ఏనుగు చేసిన సాహసాన్ని అందరు మెచ్చుకుంటున్నారు. తల్లి హృదయానికి అవధులు లేవని ఒక నెటిజన్‌ అంటే… మరొక నెటిజన్ ‘ ఈ లోకంలో తల్లికి మించిన దైవం లేదు’ అన్నాడు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Super Star Krishna latest: అయ్యో.. ‘సూపర్‌ స్టార్‌ కృష్ణ’కు ఏమైంది..?చూసి షాక్ లో అభిమానులు..

viral video: వేరే మహిళతో ప్రియుడి పెళ్లి.. తాళికట్టే మంటపానికి ప్రియురాలు ఎంట్రీ..!

Viral Video: నడిరోడ్డుపై వీరనారి.. విశ్వరూపం చూపించేసిందిగా.. ఔరా.. అంటున్న నెటిజనం..

Viral Video: రోడ్డు దాటుతున్న బైక్ ను ఢీ కొట్టి.. ఆగకుండా ఈడ్చుకెళ్లి.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో..

Monkey Funny video: మొద‌టిసారి డ్రాగ‌న్ ఫ్రూట్ తిన్న పిల్లకోతి రియాక్షన్‌.. నెట్టింట నవ్వులు పూయిస్తున్న వీడియో

Viral Video: సంగీత్‌ ఫంక్షన్‌లో డాన్స్‌ అదరగొట్టిన నవ వధువు..! అదిరిపోయే స్టెప్పులకు కామెంట్లతో ఆశీర్వచనాలు